Cop Kicks Baskets: కూరగాయల బుట్టలను కాలితో తన్నిన పోలీస్.. సస్పెండ్

ఇది సిగ్గుపడే, ఒప్పుకోలేనటువంటి చర్య. ఆ వ్యక్తిని సస్పెండ్ చేశాం. అటువంటి ప్రవర్తనను ఒప్పుకునేదే లేదు. ఇలాంటి వాటికి పాల్పడితే సీరియస్...

Cop Kicks Baskets: కూరగాయల బుట్టలను కాలితో తన్నిన పోలీస్.. సస్పెండ్

Cop Kicks Baskets

Cop Kicks Baskets: పోలీస్ అధికారి ఇసుమంతైన జాలి లేకుండా ప్రవర్తించిన తీరుకు ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి దగ్గరకు వెళ్లిన పంజాబ్ పోలీస్.. ఆ బుట్టలను కాలితో తన్నాడు. ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో రికార్డ్ అయింది.

ఫగ్వారా ఎస్హెచ్వో నవదీప్ సింగ్ అతని టీం టౌన్ లో పాట్రోలింగ్ కు వెళ్లింది. పంజాబ్ లో జరుగుతున్న పాక్షిక లాక్ డౌన్ గురించి వాకబు చేయడానికి వచ్చారు. సారాయ్ రోడ్ కు రాగానే చాలా మంది రోడ్ పక్కనే దుకాణాలు పెట్టుకుని కూర్చున్నారు. కార్ దిగిన వెంటనే కూరగాయల దుకాణాల దగ్గరకు వెళ్లి బూటు కాలితో బుట్టలను తన్నాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై కపూర్తలా ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ యాక్షన్ తీసుకుంటూ అతణ్ని సస్పెండ్ చేశారు. అటువంటి చర్యలు కరెక్ట్ కాదని రూల్స్ కు వ్యతిరేకంగా సర్వీస్ చేస్తే శిక్ష తప్పదని వారించారు.

సంవత్సరం నుంచి కొవిడ్ ను ఎదిరించి సేవలు అందిస్తున్నారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రవర్తన అతనికే కాకుండా పూర్తి పోలీసులకే చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు. దీనిపై డిపార్టమెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పారు.

దీనిపై పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా కూడా రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఇది సిగ్గుపడే, ఒప్పుకోలేనటువంటి చర్య. ఆ వ్యక్తిని సస్పెండ్ చేశాం. అటువంటి ప్రవర్తనను ఒప్పుకునేదే లేదు. ఇలాంటి వాటికి పాల్పడితే సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం. అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.