Cop Steals Eggs: రోడ్‌పై బండి నుంచి గుడ్లు దొంగిలించిన పోలీస్

పంజాబ్ లో ఉండే హెడ్ కానిస్టేబుల్.. బిజీ రోడ్‌పై ఉన్న బండి నుంచి గుడ్లను దొంగించాడు. ఛండీఘడ్ లోని ఫతేగర్ సాహిబ్ టౌన్ లో ఘటన జరిగింది. పోలీసును పృతిపాల్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించారు.

Cop Steals Eggs: రోడ్‌పై బండి నుంచి గుడ్లు దొంగిలించిన పోలీస్

Cop Steals Eggs

Cop Steals Eggs: పంజాబ్ లో ఉండే హెడ్ కానిస్టేబుల్.. బిజీ రోడ్‌పై ఉన్న బండి నుంచి గుడ్లను దొంగించాడు. ఛండీఘడ్ లోని ఫతేగర్ సాహిబ్ టౌన్ లో ఘటన జరిగింది. పోలీసును పృతిపాల్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించారు. తన పక్కనే ఉన్న బండిలో నుంచి గుడ్లను పోలీస్ యూనిఫామ్ లో పెట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.

మొబైల్ ఫోన్ లో రికార్డ్ అయిన వీడియో క్లిప్ లో.. గుడ్లను దొంగిలించిన పోలీస్ ఆ బండి యజమాని వస్తుండగా వెంటనే రోడ్ దాటుతున్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత అవే గుడ్లను సిగ్నల్ గా చూపించి ఆటోను ఆపేశాడు. వీడియో వైరల్ గా మారడంతో అధికారులు విషయం తెలుసుకుని అతణ్ని సస్పెండ్ చేశారు.

పృతి పాల్ సింగ్ అనే ఫతేఘర్ సాహిబ్ పోలీస్ రోడ్ మీద బండి నుంచి గుడ్లను దొంగిలిస్తూ కనిపించాడు. దాని యజమాని అక్కడ లేకపోవడంతో వాటిని జేబులలో దాచేసుకున్నాడు. అతనిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ వేసి సస్పెండ్ చేశామని ట్వీట్ చేసింది పంజాబ్ పోలీస్ శాఖ.