ఆపరేషన్ సక్సెస్, ఏడున్నర గంటల సర్జరీ తర్వాత పంజాబ్ పోలీస్ తెగిన చేతిని తిరిగి అతికించిన డాక్టర్లు

పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 03:52 AM IST
ఆపరేషన్ సక్సెస్, ఏడున్నర గంటల సర్జరీ తర్వాత పంజాబ్ పోలీస్ తెగిన చేతిని తిరిగి అతికించిన డాక్టర్లు

పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు

పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు చూపించాలని అడగటంతో వారు పోలీసులపై దాడికి తెగబడ్డారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్ఐ) హర్జీత్‌ సింగ్‌ చేతిని కత్తితో నరికారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ పోలీస్ ను చండీఘడ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. PGIMERలోని డాక్టర్ల బృందం పోలీస్ కు సర్జరీ చేసింది. ఈ సర్జరీ సక్సెస్ అయ్యింది. తెగిపోయిన చేతిని తిరిగి అతికించారు డాక్టర్లు. ఏడున్నర గంటల సుదీర్ఘ కాంప్లెక్ సర్జరీ తర్వాత డాక్టర్ల బృందం సక్సెస్ అయ్యింది. సర్జరీ సక్సెస్ కావడంతో డాక్టర్ల బృందంతో పాటు పోలీసులు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. 

డాక్టర్ల బృందానికి సీఎం థ్యాంక్స్:
ఏఎస్ఐ హర్జీత్‌ సింగ్‌ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనిపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. ”నాకు చాలా ఆనందంగా ఉంది. ఏడున్నర గంటల సర్జరీ సక్సెస్ అయ్యింది. తెగిన ఏఎస్ఐ హర్జీత్ సింగ్ చేయిని తిరిగి అతికించారు. ఆయన త్వరగా కోలుకోవాలి. డాక్టర్ల బృందానికి ధన్యవాదాలు. వారి కృషికి అభినందనలు” అని ట్వీట్ చేశారు.

పాస్ లు చూపించాలన్న పోలీసులపై కత్తులతో దాడి:
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. మండుటెండుల్లో డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. లాక్ డౌన్ వేళ రోడ్డుపైకి వచ్చిన వారిని ప్రశ్నించడమే వారి పాలిట పాపమైంది. ఆదివారం(ఏప్రిల్ 12,2020) పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఏకంగా ఏఎస్ఐ హర్జీత్ సింగ్‌ చేయి నరికేశారు. ఈ దాడిలో మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

ఏఎస్ఐ చేయి నరికేశారు:
స్థానిక కూరగాయల మార్కెట్‌ దగ్గర పోలీసులు లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్‌(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్‌యూవీ వాహనంలో వచ్చారు. పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరారు. అంతే వారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బారికేడ్లపైకి వాహనాన్ని పోనిచ్చారు. అడ్డుకున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) హర్జీత్‌ సింగ్‌ చేతిని తమ దగ్గరున్న కత్తితో నరికారు. మార్కెట్‌ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులనూ గాయపర్చారు.
 

పోలీసులపై దాడి తర్వాత గురుద్వారలో నక్కిన దుండగులు:
పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్‌ గ్రామంలోని గురుద్వారలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన పోలీసులను, హర్జీత్‌ సింగ్‌ను, ఆయన తెగిన చేయిని.. చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)కు తరలించి చికిత్స అందించారు. పోలీసులపై దాడి చేసిన ఘటనతో సంబంధం ఉన్న నిందితులను అరెస్టు చేసినట్లు పంజాబ్ సీఎస్ జతిందర్ సింగ్ తెలిపారు. లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

గ్యాస్ సిలిండర్లతో గురుద్వారను పేల్చేస్తామని వార్నింగ్:
 నిహంగ్‌ల ముఠా గురుద్వారలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్‌ సిలిండర్లతో గురుద్వారను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read |  ఈరోజు నుంచే తెరుచుకున్న మద్యం షాపులు.. ప్రతిరోజు ఏడు గంటలు ఓపెన్!