Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్‌ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యకలాపాల్లో...

Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

Punjab (1)

Bhagwant Mann : అతను కామన్‌ మ్యాన్‌ కాదు.. ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న కమెడీయన్‌..! అయితే ఇప్పుడు కమెడీయన్‌ కాదు..! పంజాబ్‌కా షాన్‌..! పంజాబ్‌కా షేర్‌..! ఇప్పుడు పంజాబ్‌కు కానున్న సీఎం. పంజాబ్‌లో ఆప్‌ చరిత్ర సృష్టించడంతో ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో పరాజయాలు.. మరెన్నో విజయాలు ఉన్నాయి. అయితే ఓటములకు కుంగిపోని ఆయన.. గెలుపుతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. గవంత్ మాన్ 1972 అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు మోహిందర్ సింగ్, ఆయన ఉపాధ్యాయుడు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని SUS ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చదివిన మాన్‌ ఇంద్రప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.

Read More : Punjab Election Review: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన “త్రిమూర్తులు”

1992లో భగవంత్ మాన్ క్రియేటివ్ మ్యూజిక్ కంపెనీలో చేరి షోలు చేయడం ప్రారంభించారు. 2013 వరకు డిస్కోగ్రఫీ ఫిల్డ్‌లో చురుకుగా ఉన్నారు. మాన్ యూత్ కామెడీ ఫెస్టివల్, ఇంటర్ కాలేజీ పోటీలలో పాల్గొన్నారు. పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలోని షహీద్ ఉధమ్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో రెండు బంగారు పతకాలు సాధించారు. 1994లో ‘కచారి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2018 వరకు 12కి పైగా సినిమాలు చేశారు. భగవంత్ మాన్ రాజకీయాలు, క్రీడలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై కామెడీ షోలు చేశారు. 2012లో కొత్తగా ఏర్పడిన పంజాబ్ పీపుల్స్ పార్టీ నుంచి తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు మాన్. లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న మాన్…. 2014లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది.

Read More : Arvind Kejriwal : దేశం మొత్తం ఇంక్విలాబ్ రావాలి.. పంజాబ్‌‌కు స్వాతంత్రం వచ్చింది..

ఇందులో భగవంత్ మాన్… సుఖ్‌దేవ్ సింగ్ ధిండాను ఓడించారు. అంతా హ్యాపీగా జరుగుతున్న ఆయన రాజకీయ జీవితంలో ఆ తర్వాత వివాదాలు వెంటాడాయి. 2016లో మాన్ మద్యం తాగి పార్లమెంటుకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన ఎంపీ హరీందర్ సింగ్ ఖాల్సా తన సీటును మార్చాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. భగవంత్‌ మాన్‌ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని, నోటి దుర్వాసన వస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పార్టీ ఖండించింది. గతేడాది పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన భగవంత్‌ మాన్‌ తాను మద్యానికి స్వస్తి పలికినట్లు, తాను మద్యం సేవించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Read More : Punjab Election Results 2022 : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి..

ఇక వివాదాస్పద వ్యాఖ్యల్లోనూ ఆయన నిత్యం వార్తల్లో నిలిచారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌లను టార్గెట్ చేస్తూ లాలూ యాదవ్ కుటుంబాన్ని కూడా ఆయన లాగాడం ఆప్పట్లో తీవ్ర చర్చనీయంశమైంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్ సంగ్రూర్ నుంచి గెలుపొందారు. ఈసారి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్‌ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న ఆయన కృషి ఫలించినట్లైంది..! పంజాబ్‌లో ఆప్‌కే పట్టం కట్టారు ప్రజలు. దీంతో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు మాన్‌.