Punjab Election Results 2022 : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి..

Assembly Election Results 2022 : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh) ఓటమి పాలయ్యారు.

Punjab Election Results 2022 : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి..

Assembly Election Results 2022 Amarinder Singh, Punjab Ex Chief Minister, Loses In Patiala

Punjab Election Results 2022 : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh) ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి అమరీందర్ సింగ్ పోటీ చేశారు. అయితే ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పటియాలలో సీఎం అమరీందర్‌పై ఆప్ అభ్యర్థి అజిత్ విజయం సాధించారు. అమరీందర్‌ సింగ్‌ ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఆ తర్వాతే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని కూడా స్థాపించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి తాను మ‌ద్దతిస్తున్నట్లు అమరీందర్ సింగ్ ప్రక‌టించారు.

అయినప్పటికీ అమరీందర్ సింగ్ పరాజయం పాలయ్యారు. పంజాబ్ లోని పటియాలో ఎన్నికల ఫలితాల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు అమరీందర్ తెలిపారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. పంజాబీలు మతపరమైన అంశాలకు అతీతంగా ఓటు వేశారని, పంజాబీయత్ నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించారని అమరీందర్ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన “కెప్టెన్” పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను ఎదుర్కొవడంతో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2017లో జరిగిన ఎన్నికల్లో 49 శాతంతో కెప్టెన్ విజయం సాధించారు.

Assembly Election Results 2022 Amarinder Singh, Punjab Ex Chief Minister, Loses In Patiala (2)

Punjab Election Results 2022 : Amarinder Singh, Punjab Ex Chief Minister, Loses In Patiala

సెప్టెంబరులో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నాయకత్వం తనను మూడుసార్లు అవమానించిందని, ఇక భరించలేనని సింగ్  పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 79 ఏళ్ల తన మాజీ పార్టీకి తనలో ఇంకా రాజకీయాలు ఉన్నాయని,హెచ్చరించారు.

మరోవైపు.. యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ దూకుడును పెంచింది. ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మక ప్రణాళికలు ఫలించినట్టుగా కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ హవానే కొనసాగుతోంది. యూపీలో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : AAP Office : ఢిల్లీలో సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌‌గా బేబీ కేజ్రీవాల్