Punjab Man: డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకోవడానికి కొడుకును చైన్‌లతో కట్టేసిన తల్లి

పంజాబ్‌లోని ఓ వ్యక్తిని డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆ కుటుంబం గొలుసులతో కట్టేసింది. ఎలా అయినా తిరిగి దారిలోకి తీసుకురావాలంటే ఇదే సరైన మార్గమని అనుకున్న ఆ కుటుంబం.. మంచానికి కట్టి కదలకుండా చేసింది.

Punjab Man: డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకోవడానికి కొడుకును చైన్‌లతో కట్టేసిన తల్లి

Drugs Addict

Punjab Man: పంజాబ్‌లోని ఓ వ్యక్తిని డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆ కుటుంబం గొలుసులతో కట్టేసింది. ఎలా అయినా తిరిగి దారిలోకి తీసుకురావాలంటే ఇదే సరైన మార్గమని అనుకున్న ఆ కుటుంబం.. మంచానికి కట్టి కదలకుండా చేసింది. “రోజూ రూ.800 డ్రగ్ షాట్స్ తీసుకుంటున్నాడు. ఐదారేళ్లుగా ఇదే పని” అని అతని తల్లి వాపోయింది.

రోజువారీ కూలీలుగా బతికే ఆ కుటుంబంలో పని లేకుండా డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతుండటం పెద్ద సమస్యగా మారింది. “అతని దగ్గర ఉన్న డబ్బంతా డ్రగ్స్ తీసుకోవడానకే ఖర్చు పెడుతున్నాడు” అని అతని తల్లి ఆరోపించింది. ఒక్కోసారి డబ్బులు సరిపోక ఇంట్లో వస్తువులు అమ్ముకుంటాడని, అడ్డుకుంటే చేయి చేసుకుంటాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ అలవాటుకు బానిసైన కొడుకును కాపాడుకోవడానికి గొలుసులతో కట్టేసి ఎనిమిది రోజులుగా అలాగే ఉంచారు.

Read Also : గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

“అతను మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టేవాడు. అందుకే అన్నీ తాళం వేసే చేస్తున్నాం. కొన్నిసార్లు పశువుల మేత తీసుకురావడంలో సహాయం చేయడానికి అతని గొలుసులను విప్పుతాను” అని తల్లి చెప్పింది.

తమ గ్రామంలో డ్రగ్స్ సులువుగా దొరుకుతున్నాయని, వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ పట్టుబడడం సర్వసాధారణమైన పంజాబ్‌, ఇన్నాళ్లుగా మాదక ద్రవ్యాల నిషేధంతో వ్యవహరిస్తోంది.