Punjab govt: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు రానున్న 400మంది పోలీసులు..

పంజాబ్ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న నాటినుండి భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజ‌యం సాధించింది. సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుండి త‌న‌దైన మార్క్ పాల‌న‌ను కొన‌సాగిస్తున్నాడు.

Punjab govt: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు రానున్న 400మంది పోలీసులు..

Panjab Cm

Punjab govt: పంజాబ్ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న నాటినుండి భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజ‌యం సాధించింది. సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుండి త‌న‌దైన మార్క్ పాల‌న‌ను కొన‌సాగిస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యేల పింఛ‌ను విష‌యంలో మాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నిసార్లు ఎన్నికైనా ఇక‌పై ఒకేఒక్క ప‌ద‌వీకాలానికి ప్ర‌భుత్వం పింఛ‌ను అంద‌జేస్తుంద‌ని సంచ‌లన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అయితే దీనిపై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో బిల్లు తీసుకురావాల‌ని పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వానికి సూచించారు.

Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

తాజాగా పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త‌ను ర‌ద్దుచేసిన పంజాబ్ స‌ర్కార్‌.. తాజాగా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, మ‌త పెద్ద‌ల‌కు కూడా భ‌ద్ర‌త‌ను తొల‌గిస్తూ నిర్ణ‌యించింది. అయితే ఇందులో రిటైర్డ్ పోలీస్ అధికారులు, మ‌త పెద్ద‌లు, రాజ‌కీయ నేత‌లు ఇలా మొత్తం 424 మంది ఉన్నారు. వీరంద‌రికీ ప్ర‌భుత్వం పోలీస్ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంది. తాజాగా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌తో వీరంద‌రూ పోలీస్ భ‌ద్ర‌త‌ను కోల్పోనున్నారు. డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది భ‌ద్ర‌త‌ను కూడా తొల‌గిస్తూ భ‌గ‌వంత్ మాన్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Conjuring House: రూ.12 కోట్ల‌కు అమ్ముడు పోయిన దెయ్యాల ఇల్లు.. ఆ సినిమా చూస్తే అస‌లు విష‌యం తెలుస్తుంది

పంజాబ్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో 400 మందికిపైగా పోలీసు సిబ్బంది వీఐపీల భ‌ద్ర‌త‌ను వీడి పోలీస్ స్టేష‌న్‌ల‌కు చేర‌నున్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం భ‌గ‌వంత్ మాన్ కీల‌క వ్యాఖ్య‌లు సైతం చేశారు. పోలీసులు సామాన్య ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, వీఐపీల భ‌ద్ర‌త పేరుతో వారిని ఇబ్బందుల పాలు చేయొద్ద‌ని అన్నారు. భ‌గ‌వంత్ మాన్ తీసుకున్న నిర్ణ‌యంతో ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. వీఐపీల్లో కొంద‌రికి ప్రాణ‌హాని ఉంద‌ని, ఈ క్ర‌మంలో వారికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త అంటూ కొంద‌రు పేర్కొంటున్నారు. మ‌రోవైపు భ‌గ‌వంత్ మాన్ తాజా నిర్ణ‌యంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.