Harjit Singh : చేతికి రెండే వేళ్లు..అద్భుతమైన చిత్రాలు వేస్తు ఆన్ లైన్ వ్యాపారం

ఆ యువకుడి చేతికి ఉన్నవి రెండే వేళ్లు. ఆ రెండు వేళ్లతోనే అత్యద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు.

Harjit Singh : చేతికి రెండే వేళ్లు..అద్భుతమైన చిత్రాలు వేస్తు ఆన్ లైన్ వ్యాపారం

Ludhiana Is Earning From Selling Paintings Online

అతను అందరిలాగానే పుట్టాడు. కానీ చేతికి రెండే వేళ్లతో పుట్టాడు.దీంతో చిన్నప్పటినుంచి అన్నం తిన్నాలన్నా..మరే పనిచేసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవాడు. పుట్టుకతోనే చేతికి రెండే వేళ్లతో పుట్టిన లూథియానాకు చెందిన హర్జిత్ సింగ్ చాలా ఇబ్బందులు పడేవాడు. కానీ కష్టాలు ఉన్నాయి కదాని అతను ఎప్పుడు దిగులు పడలేదే. చేసే పనుల్లో ఇబ్బందులున్నాయని ఆగిపోలేదు. తన వైకల్యాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.చేతికి ఉండాల్సిన ఐదు వేళ్లు లేకుండా ఉంటే ఏంటీ? ‘రెండు వేళ్లు’ ఉన్నాయిగా అనుకున్నాడు.

అవికూడా లేకుండా పుట్టినవారి కంటే నేను చాలా బెటర్ అనుకున్నాడు. అలా అతని ఆలోచనల నుంచి అత్యద్భుతమైన కళాఖండాలను సృష్టించాడు.చేతికి రెండే వేళ్లున్నా..ఆ రెండు వేళ్లతోనే పెన్సిల్ పట్టుకున్నాడు. మొదట్లో చాలా కష్టమయ్యేది. కానీ హర్జిత్ సింగ్ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. అలా అసమానతను ధిక్కరించి అద్భుతమైన బొమ్మలు వేయటం ప్రారంభించాడు.అలా అతని ‘చేతి వేళ్ల’నుంచి జాలువారిని చిత్రాలను ఆన్ లైన్ లో అమ్మానికి పెట్టి చక్కగా సంపాదిస్తున్నాడు. హర్జిత్ వాటర్ కలర్స్ తోను పాటు పెన్సిల్ తో కూడా హర్జిత్ సింగ్ బొమ్మలు వేస్తాడు. ఆచిత్రాలు చూస్తే చేయి తిరిగిన చిత్రకారులు వేశారా?అనిపిస్తుంది.

ఈ సందర్భంగా హర్జిత్ సింగ్ మాట్లాడుతు..నేను పుట్టుకతోనే రెండు వేళ్లతో పుట్టాను. నేను ఎదిగే కొద్ది చేసుకునే పనులు కాస్త కష్టమయ్యేవి.కానీ రెండు వేళ్లతోనే అవి ఇవీ పట్టుకోవటం..పని చేయటం అలవాటు చేసుకున్నానని తెలిపాడు. చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అలా పెయింటింగ్ వేయాలంటే రెండు వేళ్లతో చాలా ఇబ్బంది పడేవాడిని.కానీ నిదానంగా అలవాటు చేసుకున్నాను. నా కుటుంబ సభ్యులు, స్కూల్లో టీచర్లు, తోటి విద్యార్ధుల ప్రోత్సాహంతో పెయింటింగ్ వేయటం నేర్చుకున్నాను.

నేను వాటర్ కలర్స్ తో పాటు పెన్సిల్ షేడింగ్ తో బొమ్మలు వేస్తానని తెలిపాడు. కానీ పెన్సిల్ షేడింగ్ చాలా కష్టమని కానీ నాకు అదే ఇష్టమని తెలిపాడు హర్జిత్ సింగ్.పెన్సిల్ తో వేయటం చాలా కష్టం..చాలా ఓపిక కావాలి..చాలా ఏకాగ్రత కావాలి అలా చేస్తేనే చక్కటి పెయింటింగ్ వేయగలం అని తెలిపాడు.

మొదట్లో కార్టూన్లు తయారు చేసేవాడిని. ఆ తరువాత అందరి సహకారంతో ఇలా పెయింటింగ్ వేస్తున్నానని నా పెయింటింగ్ లో ఆన్ లైన్ లో అమ్ముతు డబ్బులు సంపాదించుకుంటున్నానని తెలిపాడు హర్జిత్ సింగ్. చూశారా? సంకల్ప బలం ఉంటే అంగ వైకల్యంకూడా ఎలా తల వంచుతుందో నిరూపించాడు హర్జిత్ సింగ్.