Amritpal Singh Arrested: అమృత్‌పాల్ లొంగిపోలేదు.. అరెస్టు చేశాం.. వివరాలు వెల్లడించిన ఐపీజీ సుఖ్‌చైన్ సింగ్

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), అమృత్‌సర్ రూరల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌‌లో అమృత్‌పాల్‌ను అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు.

Amritpal Singh Arrested: అమృత్‌పాల్ లొంగిపోలేదు.. అరెస్టు చేశాం.. వివరాలు వెల్లడించిన ఐపీజీ సుఖ్‌చైన్ సింగ్

Amritpal Singh Arrested

Amritpal Singh Arrested: ఖలిస్థానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అతని అరెస్టుకు సంబంధించి వివరాలను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. అమృత్‌పాల్ సింగ్ లొంగిపోలేదని చెప్పారు. అమృత్‌పాల్ మోగా జిల్లాలోని రోడె గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉంది. పోలీసులు అతను ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేశారు. తద్వారా అతనికి తప్పించుకొనేందుకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది. ఆ తరువాత రోడె గ్రామం నుంచి అతన్ని ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో ఎన్ఎస్ఏ పోలీసులు అరెస్టు చేశారని సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు.

Amritpal Singh: ఎట్టకేలకు దొరికాడు..! అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), అమృత్‌సర్ రూరల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. అమృత్‌పాల్ రోడె గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు ఎన్ఎస్ఏ సమాచారం ఇచ్చింది. దీంతో ఎన్ఎస్ఏ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా రోడె గ్రామంకు చేరుకొని గ్రామాన్ని చుట్టుముట్టారు. గురుద్వారా గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ మొదలు పెట్టారు. గురుద్వారా యొక్క ఆచారాలకు అనుగుణంగా పోలీసులు గురుద్వారా లోపలికి వెళ్లలేదని సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు. ఆ తరువాత తప్పించుకొనేందుకు ఎలాంటి మార్గంలేకపోవటంతో అమృత్ పాల్ సింగ్‌ను ఎన్ఎస్ఏ అరెస్టు చేసిందని అన్నారు. అయితే, అరెస్టుకు ముందు అమృత్‌పాల్ గురుద్వారా లోపల ప్రార్థనలు చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై సుఖ్‌చైన్ స్పందిస్తూ.. గురుద్వారా లోపల ఏం జరిగిందో తెలియదని చెప్పారు. అమృత్ పాల్‌ను అరెస్టు చేసిన తరువాత అసోంలోని దిబ్రూఘర్ జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు.

Amritpal Singh: లండన్ పారిపోతున్న అమృతపాల్ సింగ్ భార్యను ఎయిర్‭పోర్టులో పట్టుకున్న అధికారులు

అమృత్ పాల్ పోలీసులకు లొంగిపోయాడని వచ్చిన వార్తలపై పంజాబ్ ఐజీ స్పందిస్తూ.. అమృత్ పాల్ తప్పించుకొనేందుకు ఎలాంటి మార్గం లేకుండా పక్కా ప్రణాళికతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అతను లొంగిపోలేదు. కానీ అతను గురుద్వారా లోపల ఉన్నాడని పోలీసులకు సమాచారం ఉంది. ఆ తరువాత కేంద్ర సంస్థ సహకారంతో ఈ ఉమ్మడి ఆపరేషన్ జరిపి అతన్ని అరెస్టు చేశారని చెప్పారు.

Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

నెలరోజులకు పైగా అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లో తలదాచుకున్నాడని పోలీసులకు సమాచారం ఉండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో కొద్దిరోజులు పోలీసులకు సెలవులను కూడా రద్దు చేశారు.అయితే, నెలరోజుల తరువాత రోడె గ్రామంలో అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.