కాలుష్యం ఎఫెక్ట్ : పంట వ్యర్థాలు తగులబెట్టిన 22 మంది రైతులు అరెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 04:09 AM IST
కాలుష్యం ఎఫెక్ట్ : పంట వ్యర్థాలు తగులబెట్టిన 22 మంది రైతులు అరెస్ట్ 

పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై  ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను లూథియానా జిల్లా యంత్రాంగం అరెస్టు చేసింది.  45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరగుతుండటం..దానికి పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం కూడా ఒక కారణంగా మారుతోంది. దీంతో ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ కోసం చర్యలు చేపట్టాయి.

ఈ అంశంపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్  కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి (పీపీసీబి) కూడా 34 చలాన్లను కోర్టుకు సమర్పించిందని తెలిపారు. చెత్త తగులబెడుతున్న అంశంపై పరిశీలించేందుకు కమిషనర్ ప్రదీప్  కుమార్ అగర్వాల్ సీనియర్ పోలీస్ అధికారులు..జిల్లా పరిపాలన అధికారులతో కలిసి లుథియానాలోని ఖాసీ కలాన్, హవాస్ సాహిబానా, రాజూల్ సహా పలు గ్రామాలలో పర్యటించారు. ఈ క్రమంలో వరిగడ్డి తగులబెడుతున్న రైతులను హెచ్చరించారు. 
పంట వ్యర్థాలు తగులబెట్టే సందర్భాలు కనిపిస్తే..పోలీసులతో పాటు సంబంధిత అధికారులను నియమించారు. ఇటువంటి జరుగుకుండా ఉండేలా చూసుకోవాలని ఆయా గ్రామ సర్పంచ్ లను సూచించారు. వరిగడ్డితో పాటు తదితర పంటల వ్యర్థాలను తగులబెడితే మాకు సమాచారం అందించాలని కోరారు.

అలా ఎవరైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దీని కోసం ఓ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తూ..0161-2404502 అనే నంబరుని సంప్రదించమని కమిషనర్ ప్రదీప్  కుమార్ అగర్వాల్ కోరారు. ఈ హెల్ప్ లైన్ నంబర్ 24 గంటూ పనిచేస్తుందని తెలిపారు. వరిగడ్డిని తగులబెట్టాలి అను అనుకునే రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే 98886-74820 నంబర్ ను సంప్రదించాలని..జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ బల్దేవ్ సింగ్ ను సంప్రదించాలని సూచించారు.