వయస్సు ఒక నంబర్ మాత్రమే : 83 ఏళ్లకు ఇంగ్లీష్‌లో పీజీ 

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 07:27 AM IST
వయస్సు ఒక నంబర్ మాత్రమే : 83 ఏళ్లకు ఇంగ్లీష్‌లో పీజీ 

చదువు అనంతరం..ఎవ్వరైనా ఏ వయస్సులోఉన్న చదువుకోవచ్చు. వయస్సుతో సంబంధంలేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఏ వయస్సులోనైనా డిగ్రీలు సాధించొచ్చు. రికార్డులు సృష్టించవచ్చు.  చదువుకోవంటే స్కూల్స్, కాలేజీలు బంక్ కొట్టి సినిమాలకో..షికార్లకో వెళ్లే నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తూ..83ఏళ్ల ముదిమి వయస్సులో పీజీ పట్టా సాధించారు పంజాబ్‌ హోషియార్‌పూర్ గ్రామానికి చెందిన సోహన్ సింగ్ గిల్.మనిషికి వయస్సు అనేది ప్రతీ సంవత్సరం మారే ఒక నంబర్ మాత్రమేనని నిరూపించారు సోహన్ సింగ్. 

సోహన్ కు చదువంటే చాలా ఇష్టం. మహిల్‌పుర్‌లోని ఓ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. డిగ్రీ అవ్వగానే పెళ్లైపోయింది. పీజీ చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. పైళ్లైన కొద్ది కాలానికే సోహన్ కెన్యా వెళ్లిపోయారు. బాధ్యతల్లో మునిగిపోవటంతో పీజీ చేయాలనుకున్న అతని కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అలా 83 ఏళ్లు వచ్చేశాయి. కెన్యా నుంచి భారత్ కు వచ్చాడు. మలి వయస్సులో దొరికిన సమయంలో మళ్లీ తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. పీజీ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సోహన్ సింగ్ గిల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌లో చేరాడు. చక్కగా చదువుకున్నాడు. కోర్సు పూర్తి చేసి పీజీ పట్టా సాధించాడు 83 ఏళ్ల వయస్సులో.  

ఈ సందర్భంగా  సోహన్ సింగ్ గిల్‌ మాట్లాడుతూ..బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ తనను చదువు ఆపకుండా పీజీ చేయమని చెప్పారనీ..కానీ కొన్ని పరిస్థితుల్లో సాధ్యం కాలేదనీ..కానీ తన గురువు చెప్పిన విషయం మాత్రం తనకు అలాగే గుర్తుండి పోయింది. ఆయన కోరిక తీర్చాలనీ..తనకు కూడా ఇష్టమైన పీజీని పూర్తిచేసి పట్టా పొందానని ఆనందంగా చెప్పారు సోహన్. సంకల్పం ఉంటే సాధించలేదని ఏదీ లేదని నిరూపించారు 83ఏళ్ల వయస్సులో పిజీ పట్టా పొందిన సోహన్ సింగ్ గిల్‌. నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.