ఉగ్రవాదులనా లేక చెట్లను ఏరివేస్తున్నారా?

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 09:39 AM IST
ఉగ్రవాదులనా లేక చెట్లను ఏరివేస్తున్నారా?

పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను ఏరివేస్తున్నారా లేక చెట్లను ఏరివేస్తున్నారా అని సిద్ధూ అన్నారు.సోమవారం  సిద్ధూ చేసిన ఓ ట్వీట్ లో…300మంది చనిపోయారు.అవునా? కాదా?. దీని ఉద్దేశ్యమేమిటి?ఉగ్రవాదులను ఏరివేస్తున్నారా లేక చెట్లనా? ఇది ఎన్నికల జిమ్మిక్కా? ఓ విదేశీ శత్రువుతో పోరాడటానికి మారువేషంలో ఓ మోసం మన భూమిని కలిగి ఉంది. ఆర్మీని రాజకీయం చేయడం ఆపండి. దేశం ఎంత గొప్పదో ఆర్మీ కూడా అంతే గొప్పదని అన్నారు. 

ఎయిర్ స్ట్రైక్స్ ఉద్దేశ్యం ఓ బలమైన మెసేజ్ పంపించడమే కానీ చంపడం కాదన్న కేంద్రమంత్రి ఎస్ ఎస్ అహ్లూవాలియా స్టేట్ మెంట్ ను, బాలాకోట్ లోని ఎయిర్ స్ట్రైక్స్ ..కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలను గెలవడానికి సహాయపడుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప అన్న స్టేట్ మెంట్ ను, మోడీ కనుక మరోసారి ప్రధాని కాకపోతే పాకిస్తాన్.. మన దేశ పార్లమెంట్ పై దాడిచెయ్యవచ్చు అన్న అస్సాం మంత్రి హిమంత బిశ్వాశర్మ అన్న స్టేట్ మెంట్ ను, ఆర్మీ డ్రెస్ లో ఓట్ల కోసం క్యాంపెయిన్ చేస్తున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఫొటోలను సిద్ధూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..యుద్ధంలో మొదట మరణించేది నిజమే అని తెలిపారు.