Panjab Police : పంజాబ్ సరిహద్దులో టిఫిన్ బాంబు స్వాధీనం

భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు.

Panjab Police : పంజాబ్ సరిహద్దులో టిఫిన్ బాంబు స్వాధీనం

Panjab Police

Panjab Police  : దీపావళి వేళ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పంజాబ్ పోలీసులు. భారత్ – పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు. జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే దీనిని అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా టిఫిక్ బాంబు విషయం బయటపెట్టారు.

చదవండి : Police Siren : పోలీస్ సైరన్ విని.. భయంతో పరిగెత్తి బావిలో పడ్డ వ్యక్తి

దీంతో పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జ‌లాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జ‌శ్వంత్ సింగ్, బ‌ల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

చదవండి : Hyderabad Police : సౌండ్ పొల్యూషన్‌పై హైదరాబాద్ పోలీసుల కొరడా

ఈ కేసులో రంజిత్ సింగ్‌‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై సిద్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 212, 216 చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టంలోని 18,19 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.