Green Fungus : పంజాబ్‌లో తొలి గ్రీన్ ఫంగస్ కేసు నమోదు

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా... తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.

Green Fungus : పంజాబ్‌లో తొలి గ్రీన్ ఫంగస్ కేసు నమోదు

Punjab Reports First Green Fungus Case From Jalandhar

Green Fungus : దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా… తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.

రెండు రోజుల క్రితం మధ్య ప్రదేశ్ ఇండోర్‌లో ఓ వ్యక్తి గ్రీన్ ఫంగస్ బారినపడినట్లు అధికారులు గుర్తించగా, పంజాబ్ లోని జలందర్‌లోని మక్సుదాన్ ప్రాంతంలో మరో కేసు తాజాగా వెలుగు చూసింది. ఈ వైరస్ ప్రభావం రోగులపై ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.

అమృత్‌సర్‌లోని 62 ఏళ్లవ్యక్తి ఇటీవలే కరోనా నుండి కోలుకున్నాడు. కోవిడ్ సోకిన పిదప అతను లూధియానాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆసమయంలో ఎక్కవ కాలం అతను ఆక్సిజన్ పై ఉన్నాడు. కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత దగ్గుతో బాధపడసాగాడు. వైద్యులకు చూపించగా అది క్షయగా మొదట భావించారు.

కానీ ఎంతకూ దగ్గు తగ్గకపోవటంతో అతడ్ని జలంధర్ లోని ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు  నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతనికి గ్రీన్ ఫంగస్ సోకివట్లు గుర్తించామని జలంధర్ లోని జిల్లా అసుపత్రి ఏపిడెమియాలజిస్ట్ డాక్టర్ పరమ్ వీర్ సింగ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం పేషంట్ అబ్జర్వేషన్ లో ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ కేసుకు ముందు మరో కేసు వచ్చింది కానీ దృవీకరించబడలేదన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇది తొలి గ్రీన్ ఫంగస్ కేసుగా నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గ్రీన్ ఫంగస్ బారిన పడిన రోగిని అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైసెన్స్ వైద్యులు ముంబై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

గ్రీన్ ఫంగస్ పేషంట్స్ లో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఫంగస్ పై మరింత అధ్యయనం చేయడం అవసరమని భావిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న తరుణంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న వారిలో కొందరు ఫంగస్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ప్రజలు ప రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని వైద్యులు  సూచిస్తున్నారు.