Oxygen Support : 24 గంటల్లో 264% పెరిగిన ఆక్సిజన్ వినియోగించే కరోనా పేషంట్ల సంఖ్య

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.

Oxygen Support : 24 గంటల్లో 264% పెరిగిన ఆక్సిజన్ వినియోగించే కరోనా పేషంట్ల సంఖ్య

Oxygen Support

Oxygen Support : దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రం అవ‌తుంది. ఢిల్లీలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రం పంజాబ్‌‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో చాలామంది అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు. పంజాబ్ లోని కరోనా పేషెంట్లలో అధికంగా శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో గ‌డిచిన‌ 24 గంటల్లో ఆక్సిజన్ తీసుకునే రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం కేవలం 62 మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్‌‌లో ఉండగా.. మరుసటి రోజుకు ఆక్సిజన్ సపోర్ట్‌‌‌పై ఉన్న వారి సంఖ్య 226కి చేరింది. కేవలం 24 గంటల్లో ఆక్సిజన్ తీసుకునే వారి శాతం 264% పెరిగింది. జనవరి 1న కేవలం 23 మంది రోగులు మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారు.

చదవండి : Moon Oxygen : చంద్రుడిపై లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ?

అంతే కాకుండా లెవ‌ల్-3 స్థాయిలో ఉన్న‌న రోగుల సంఖ్య శుక్రవారం 20 నుండి శనివారం 55కి పెరిగింది, లెవల్ -3 రోగుల సంఖ్య శాతం పరంగా 175% పెరిగింది. అదే సమయంలో, వెంటిలేటర్‌పై ఉన్న రోగులు 6 నుంచి 11కి చేరుకున్నారు. పంజాబ్ క‌రోనా పాజిటివిటీ రేటు శుక్రవారం 11.75% ఉండగా శనివారం 14.64%కి చేరుకుంది. జనవరి 1న, సానుకూలత రేటు 2.02%. పాటియాలా (840), మొహాలి (563), లూథియానా (561), అమృత్‌సర్ (346)లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇక వచ్చే నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సభలు సమావేశాలు అధికంగా జరిగే అవకాశం ఉండటంతో కరోనా కేసులు ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

చదవండి : Oxygen Plant : ఆక్సిజన్ ప్లాంట్ పెడితే ప్రభుత్వం నుంచి రూ.కోటి సబ్సిడీ