Punjab CM : విద్యుత్ ఛార్జీలను యూనిట్ కు రూ.3 తగ్గించిన పంజాబ్

దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు చన్నీ సర్కార్ తీపికబురు అందించింది. సామన్యుడికి ఊరట కలిగించేలా..విద్యుత్ ఛార్జీలను యూనిట్​ కు 3 రూపాయలు తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు

Punjab CM : విద్యుత్ ఛార్జీలను యూనిట్ కు రూ.3 తగ్గించిన పంజాబ్

Pu

Punjab CM దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు చన్నీ సర్కార్ తీపికబురు అందించింది. సామన్యుడికి ఊరట కలిగించేలా..విద్యుత్ ఛార్జీలను యూనిట్​ కు 3 రూపాయలు తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు సోమవారం పంజాబ్ సీఎం ప్రకటించారు. తగ్గిన విద్యుత్ ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు.

విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని మాట్లాడుతూ…ప్రస్తుతం మేం కొనుగోలు చేసిన విద్యుత్‌ రూ. 2.65. మేము ఓ సర్వే చేసినప్పుడు ప్రజలు తమకు ఉచిత విద్యుత్‌ వద్దు, చౌకగా కరెంట్‌ కావాలని చెప్పారు. ప్రస్తుతం మా ధర 100 వాట్‌ల వరకు రూ.1.19. 100-300 యూనిట్ల వరకు కొత్త విద్యుత్ ధరలు యూనిట్‌ కు రూ.4గా ఉండగా.. ఇంతకుముందు రూ.7గా ఉండింది. 300 యూనిట్లకుపైన..యూనిట్‌కు రూ. 5లకే ప్రజలకు విద్యుత్తు అందుతుంది.

నివాస కనెక్షన్ యొక్క ప్రతి స్లాబ్‌లో రూ.3 తగ్గించబడింది. కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో దేశంలో…రెసిడెన్షియల్ కనెక్షన్ల కోసం చౌకైన విద్యుత్‌ను అందించే ఏకైక రాష్ట్రంగా పంజాబ్ అవతరించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలకు లబ్ది జరుగుతుందని సీఎం చన్నీ తెలిపారు.

మరోవైపు,ఉద్యోగులకు డీఏను కూడా పెంచింది పంజాబ్ సర్కార్. కరవు భత్యం(DA)ను 11శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం చన్నీ తెలిపారు.

ALSO READ Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?