Amritpal Singh: అమృత్‌పాల్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఏప్రిల్ 14వరకు సెలవులు రద్దు

ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీచేశారు.

Amritpal Singh: అమృత్‌పాల్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు.. ఏప్రిల్ 14వరకు సెలవులు రద్దు

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఇంకా పరారీలోనే ఉన్నాడు. పంజాబ్ (Punjab) రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జల్లెడు పడుతున్నప్పటికీ అతని ఆచూకీ దొరడం లేదు. పైగా వరుస వీడియోలు విడుదల చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. రకరకాల మారు వేషాల్లో తిరుగుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా అమృత్ పాల్‌సింగ్  ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ నెలలో సిక్కులు సమావేశం కావాలని సూచించాడు. అంతేకాదు, నేను ఎక్కడికి పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పారు.

Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

పోలీసులకు సెలవులు రద్దు..

ఈనెల 14న పంజాబీలకు కీలకమైన సర్‌బత్ ఖల్సా కార్యక్రమం జరగనుంది. ఆరోజు ఆకల్ తక్త్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పైగా ఈ వేడుకలు చేయాలని అమృత్‌పాల్ సింగ్ స్వయంగా సూచించాడు. అయితే, ఆ రోజు పోలీసులకు లొంగిపోతాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అప్పటి వరకు నిఘాను మరింత పెంచారు. అమృత్ పాల్ లొంగిపోకముందు పట్టుకోవాలని పంజాబ్‌లోని ప్రతీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 14 వరకు అందరికీ సెలవులు రద్దు చేస్తూ పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆపీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది ఎవరికి 14 వరకు సెలువులు లేవని, సెలవులో ఉన్నవారు విధుల్లో చేరాలని పంజాబ్ డీజీపీ స్పష్టం చేశారు.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోనే ఉన్నాడా? తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

అమృత్‌పాల్ కోసం పోలీసుల వెతుకులాట ఎందుకు?

అమృత్ పాల్ సింగ్‌‌కోసం పోలీసులు గత కొంతకాలంగా వెతుకుతున్నారు. అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్ ప్రీత్‌సింగ్‌ను కొద్ది వారాల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్టేషన్ పై దాడికి దిగారు. దీంతో పోలీసులు లవ్ ప్రీత్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అమృత్ సింగ్‌పాల్‌పై పోలీసులు గురిపెట్టారు. యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్ పాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి అమృత్ పాల్ పరారవుతున్నాడు. అంతేకాక, అమృత్ పాల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. అతను దేశం విడిచి పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ నెల 14న అమృత్ పాల్ సింగ్ లొంగిపోతాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులందరికీ 14వరకు సెలవులు రద్దు చేశారు.