Punjab:‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు

‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు వేశారు.

Punjab:‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు

'you Reap What You Sow' Congress' Navjot Sidhu Reflects

‘You reap what you sow’: Congress’ Navjot Sidhu reflects : పంజాబ్ లో స్థానిక పార్టీలతో పాటు జాతీయ పార్టీలను కూడా చిత్తు చేసి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసిపారేసింది. అంచనాలకు మించి ఆప్ విజయం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈక్రమంలో పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్…పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.

Also read : Bhagwant Mann : సీఎంగా భగవంత్ మాన్ దాస్ ప్రమాణ స్వీకారం.. డేట్ ఫిక్స్

ఈ సందర్భంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సిద్ధూ సొంత పార్టీ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.‘‘మీరు (లేదా మనం) ఏ విత్త‌నం నాటితే ఆ మొక్క బ‌య‌ట‌కువ‌స్తుంద‌ని.. ఈ ఎన్నిక‌లు మార్పు కోసం జ‌రిగాయ‌ని..ప్ర‌జ‌లు గొప్ప నిర్ణ‌యం తీసుకున్నార‌ని..వారెప్పుడూ పొరపాటు చేయ‌రు’ అంటూ కాంగ్రెస్ పార్టీకి చుర‌క‌లు వేశారు. సీఎం అభ్య‌ర్ధిగా చ‌ర‌ణ్జిత్ సింగ్ చ‌న్నీని ప్ర‌క‌టించ‌డం కాంగ్రెస్ పార్టీ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసిందా అని ప్ర‌శ్నించ‌గా చ‌న్నీని సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌జ‌లు అంగీక‌రించారా? లేదా? అనే విష‌యం లోకి తాను వెళ్ల‌ద‌లుచుకోలేద‌ని..ఎలాగూ ఓడిపోయాం కాబట్టి అది ఇప్పుడు అప్రస్తుతం అని తప్పించుకున్నారు.

సిద్ధూలో లోపాలు వెతికిన వారిని ప్ర‌జ‌లు ప‌ది అడుగుల గోతిలో ప‌డేశార‌ని సిద్ధూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తాజా పంజాబ్ ఫ‌లితాల‌తో మ‌నం కొత్త విత్త‌నాల‌ను నాటాల‌ని..ఇప్పుడు కావాల్సింది చింత కాద‌ని, చింత‌న్ (మేధోమ‌ధ‌నం) అవ‌స‌ర‌మ‌ని సిద్ధూ స్టైల్ ఆఫ్ మార్కులో వ్యాఖ్యానించారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 117 స్దానాల‌కు గాను ఆప్ 92 స్ధానాల్లో విజ‌యం సాధించ‌గా పాల‌క కాంగ్రెస్ 18 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది.

Also read : Bhagwant Mann : ఆప్ అధినేత కేజ్రీవాల్ తో భగవంత్ మాన్ భేటీ.. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ

ఎస్ఏడీ మూడు స్ధానాలు, బీజేపీ రెండు స్ధానాలు, బీఎస్‌పీ ఒక స్ధానంతో స‌రిపెట్టుకున్నాయి. ఆప్ ప్ర‌భంజ‌నంలో చ‌న్నీ, ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్, కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌, సిద్ధూ వంటి దిగ్గ‌జ నేత‌లు ఓట‌మి పాల‌య్యారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ ఓట‌మితో సీఎం చ‌న్నీ గురువారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రాలు స‌మ‌ర్పించారు. మార్చి 16న ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కాగా..ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.