AK-47తో పంజాబీ సింగర్ వీడియో షూట్, DSP సస్పెండ్

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 04:50 AM IST
AK-47తో పంజాబీ సింగర్ వీడియో షూట్, DSP సస్పెండ్

పంజాబ్ పోలీసులు సోమవారం ఓ వివాదాస్పద కేసులో పంజాబీ సింగ్ సిధూ మూసేవాలాతో పాటు 8మందిపై చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. షూటింగ్ రేంజ్‌లో AK-47తో వీడియో సాంగ్ తీశారు. ఈ ఘటనపై సంగ్రూర్ డీఎస్పీ(హెడ్ క్వార్టర్స్) దల్జీత్ సింగ్ వీర్క్ ను పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా సస్పెండ్ చేశారు. 

కరోనావైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో దేశమంతా కర్ఫ్యూలో ఉండగా ఈ సాంగ్ షూట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రొఫెషనల్ షూటర్లను అరెస్టు చేశారు. వారిలో ఒకరు నేషనల్ లెవల్ స్కీట్ షూటర్ కరమ్ సింగ్ లెహల్ ఉన్నారు. 

పంజాబ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ.. షూటింగ్ రేంజిలో మూసేవాలా AK-47తో షాట్స్ ఫైర్ చేశారు. గన్ మెన్‌లలో ఒకరైన బర్నాలా జిల్లాకు చెందిన లెహాల్ అనే వ్యక్తిపై కేసు రిజిష్ట్రర్ అయింది.

See Also | అదృష్టం అంటే గిదేనేమో : Salesmenకు రూ. 20 కోట్ల లాటరీ