Breast Milk Bank: పంజాబ్‌లో మొదటి తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు..

పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.పుట్టిన మొదటి గంటలోనే నవజాత శిశువులకు పాలు అందించాలనే ఉద్ధేశ్యంలో ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు ప్రారంభమైంది.

Breast Milk Bank: పంజాబ్‌లో మొదటి తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు..

Breast Milk Bank In Ludhiana

Breast Milk Bank In Ludhiana: తల్లిపాలు.బిడ్డకు ఆరోగ్యానికి సోపానాలు. బిడ్డకు పాలు ఇస్తే బిడ్డకే కాదు తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు అని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. అటువంటి తల్లిపాలు బిడ్డలందకి లభిస్తున్నాయా? అంటే లేదనే చెప్పాలి. తల్లిపాల అందని బిడ్డల కోసమే ‘తల్లిపాల బ్యాంకు’ (breast milk Bank)లు. తల్లిపాలు బ్యాంకుల వల్ల ఎంతోమంది నవజాత శిశువులకు పాలు అందుతున్నాయి.తద్వారా బుజ్జాయిల బొజ్జలు నిండలమే కాదు..వారి ఆరోగ్యానికి ఈ తల్లిపాల బ్యాంకులు ఆరోగ్య సోపోనాలుగా మారుతున్నాయి. దీంట్లో భాగంగానే నవ జాత శిశువులకు తల్లి పాలు అందించటానికి పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తల్లి పాల బ్యాంకును ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Read more : Exercise in Pregnancy: బొజ్జలో బుజ్జాయి కోసం అమ్మకు సులువైన వ్యాయామాలు.

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా నగరంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. లుథియానా సివిల్ హాస్పిటల్‌లోని తల్లీపిల్లల ఆసుపత్రి ఆవరణలో అధికారులు శుక్రవారం (సెప్టెంబర్ 10.9.2021) తల్లి పాల బ్యాంకును ప్రారంభించారు. పుట్టిన మొదటి గంటలోనే నవజాత శిశువులకు పాలు అందించాలనే ఉద్ధేశ్యంలో ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఈ పాల ద్వారా పిల్లలకు సరైన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఈ బ్యాంకు ద్వారా సేకరించిన తల్లిపాలను ఆరోగ్య కార్యకర్తలు అవసరమైన నవజాత శిశువులకు అందించనున్నారు.

Read more : Exercise in Pregnancy: బొజ్జలో బుజ్జాయి కోసం అమ్మకు సులువైన వ్యాయామాలు.

పిల్లలు పుట్టిన మొదటి గంటలోపు చనుబాలివ్వక పోవడం వల్ల బిడ్డలు పోషకాహాలోపంతో బాధపడు అనారోగ్యాలకు గురవుతున్నారని..అలాగే పాలు ఎక్కువ అయిన తల్లులకు కూడా సమస్యలు వస్తుంటాయని..కాబట్టి తల్లిపాలు అవసరమైన శిశువుల కోసం ప్రతీ తల్లీ తనపాలనుదానం చేయాలని కోరారు. పాలు ఎంత పిండినా తల్లిలో పాలు ఎక్కువగా వస్తుంటాయని కాబట్టి తమ పాలు దానం చేయటం వల్ల తమ బిడ్డలకు పాలు లోపం ఉంటుందని అనుకోవద్దని పాలు దానం చేస్తే తల్లికి పాలు అంతగా వస్తాయని తెలిపారు.

Read more : Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!