వామ్మో : బాత్రూమ్ లో కొండచిలువ

అర్థరాత్రి..అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది. పరిగెత్తుకుంటు వెళ్లి చూస్తే అక్కడ పెద్ద కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది? పై ప్రాణం పైనే పోతోంది కదూ.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 05:39 AM IST
వామ్మో : బాత్రూమ్ లో కొండచిలువ

అర్థరాత్రి..అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది. పరిగెత్తుకుంటు వెళ్లి చూస్తే అక్కడ పెద్ద కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది? పై ప్రాణం పైనే పోతోంది కదూ.

ముంబై : అర్థరాత్రి..అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది. పరిగెత్తుకుంటు వెళ్లి చూస్తే అక్కడ పెద్ద కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది? పై ప్రాణం పైనే పోతోంది కదూ..ఓ నాయనో అంటే కేకలు పెట్టటం ఖాయం. అదిగో అటువంటి ఘటనే జరిగింది. అర్థరాత్రి బాత్రూమ్ కి వెళ్లిన ఓ మహిళకు అక్కడ కొండచిలువ కనిపించింది.  ముంబై భాండప్ ప్రాంతంలోని మున్సిపల్ క్వార్టర్స్ లో జరిగిందీ ఘటన. 
Read Also : నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు

వినయ్ ధోబ్ లే అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో భార్య అర్దరాత్రి బాత్రూమ్ కు వెళ్లగా పెద్ద కొండచిలువ బాత్రూమ్ బేసిన్ లో  కనిపించడంతో హడలిపోయి పెద్దగా అరుస్తు  కేకలు పెట్టింది. వెళ్లి చూసిన వినయ్ కూడా భయపడ్డాడు..వెంటనే భార్య, పిల్లలను తీసుకొని బైటకు వచ్చేసి పాములు రెస్క్వింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ సంస్థకు సమాచారమిచ్చారు. వెంటనే వచ్చిన సంస్థ వాలంటీర్ అమన్ సింగ్ ఏకంగా  ఏడు అడుగుల పొడవు గల కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. ఇంటి లోపల ఉండే బాత్రూమ్ పైపు లైను నుంచి కొండచిలువ వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారున. కాగా బాత్రూమ్ లో కొండచిలువ స్థానికులకు పెద్ద టాపిగ్ మారిపోయింది. మన బాత్రూమ్ లోకి కూడా పాములు వస్తాయేమోనని భయపడుతున్నారు. 
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ