QS World University Rankings : వరల్డ్ టాప్- 200 యూనివర్శిటీల్లో భారత్ నుంచి మూడు

లండన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకులను బుధవారం ప్రకటించింది.

QS World University Rankings : వరల్డ్ టాప్- 200 యూనివర్శిటీల్లో భారత్ నుంచి మూడు

Iis

QS World University Rankings లండన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకులను బుధవారం ప్రకటించింది. యాజమాన్య ప్రతిష్ట, సంస్థ ప్రతిష్ట, సంస్థాగత పరిశోధన, బోధనా సిబ్బంది,విద్యార్థి నిష్పత్తి, అంతర్జాతీయ స్థాయి బోధనా సిబ్బంది వంటి ఆరు ప్రామాణిక అంశాల ఆధారంగా ఏటా ‘QS’ సంస్థ యూనివర్శిటీలకు ర్యాంకులు కేటాయిస్తుంది.

బుధవారం విడుదలైన QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022లో… ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో వరుసగా పదోసారి అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ కి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రెండోస్థానం సాధించగా, అమెరికాకి చెందిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ కి చెందిన కేంబ్రిడ్జి యూనివర్శిటీ మూడో ర్యాంకు సాధించింది.

భారత్‌కు చెందిన పలు యూనివర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాయి. సంస్థాగత పరిశోధన విభాగం (సీపీఎఫ్​)లో బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్​సీ) ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీగా నిలిచింది. ఈ విభాగంలో ఐఐటీ గువాహటి 41వ స్థానంలో నిలిచింది. అయితే పూర్తి స్థాయి ర్యాంకింగ్‌లో మాత్రం భారత్‌లోని విశ్వవిద్యాలయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో గతంలో కంటే 4 ర్యాంకులు దిగజారి ఐఐటీ-బాంబే 177 ర్యాంకుకు పడిపోయింది. ఐఐటీ ఢిల్లీ 193వ స్థానంలో నిలిచింది.