Karnataka : కర్ణాటక వెళ్తే.. క్వారంటైన్, కొవిడ్ టెస్టు మస్ట్.. వారికి మాత్రమేనట!

కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.

Karnataka : కర్ణాటక వెళ్తే.. క్వారంటైన్, కొవిడ్ టెస్టు మస్ట్.. వారికి మాత్రమేనట!

Quarantine, Covid Test Must For People From New Covid Variant Affected Countries

Karnataka new Covid variant : కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదండోయ్.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట. కొన్నిరోజులుగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఓమిక్రాన్ అనే కొత్త కొవిడ్-19 వేరియంట్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చే వ్యక్తులకు RT-PCR టెస్టు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు బెంగళూరులో దిగిన తర్వాత ముందుగా RT-PCR టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ సూచించారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలితే.. వారంతా విమానాశ్రయం చుట్టుపక్కల ఉండి అవసరమైతే చికిత్స పొందుతారని ఆయన చెప్పారు. సిటీకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్ బోట్స్వానాలో ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారింది. డెల్టా వేరియంట్‌ను అధిగమించిందని సమాచారం.

ఇప్పటివరకూ సింగిల్ డోసు మాత్రమే తీసుకుని.. రెండవ డోస్ ఇంకా తీసుకోని 45 లక్షల మందినే ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. గత 6 నెలల్లో 6 జెనోమిక్ ల్యాబ్‌లను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ధార్వాడ్‌లోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 281 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి తెలిపారు. కాలేజీలో మొత్తం 1,788 మంది విద్యార్థులకు టెస్టులు నిర్వహించామన్నారు. ఇంకా కొన్ని ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

అంతర్జాతీయ పాఠశాలలో 34 కేసులు, మరో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై చర్చించేందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోగ్య, విపత్తుల శాఖ నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శనివారం కొత్తగా 402 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, కర్ణాటకలో 6,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2020లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ కర్ణాటకలో మొత్తంగా 29,94,963 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read Also : ICC : కరోనా కొత్త వేరియంట్ టెన్షన్.. వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ రద్దు