మా అత్త జుట్టు పట్టుకు లాగి కొట్టింది : ఐశ్వర్యారాయ్

ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Published By: chvmurthy ,Published On : December 16, 2019 / 09:49 AM IST
మా అత్త జుట్టు పట్టుకు లాగి కొట్టింది : ఐశ్వర్యారాయ్

ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తేజప్రతాప్, ఐశ్వర్యారాయ్ ల విడాకులు పిటీషన్ కోర్టులో  విచారణలో ఉంది.

పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్‌ ప్రతాప్‌ భార్య ఐశ్వర్య… తేజ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్‌ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్‌ పోలీసులను ఆశ్రయించారు. తేజ్‌ప్రతాప్‌ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. 

ఐశ్వర్యారాయ్  కుటుంబ సభ్యులను,ఆమె తండ్రి ఎమ్మెల్యే చంద్రికారాయ్ ను కించపరుస్తూ  తేజ్ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ లో పోస్టర్లు  అంటించారు. ఆవిషయమై అత్త రబ్రీ దేవితో మాట్లాడేందుకు వచ్చి తన కుటుంబ సభ్యులను కించపరిస్తే ఊరుకునేది లేదని అనగా….రబ్రీదేవి తనను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. పర్సనల్ సెక్యూరిటీతో 10 సర్క్యులర్ రోడ్డులోని ఇంటి నుంచి గెంటివేసారని, గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్‌, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్‌ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులకు చెప్పారు.

విషయం తెలుసుకున్న ఐశ్వర్య తండ్రి, ఎమ్మెల్యే చంద్రికారాయ్ ఐశ్వర్యను తన ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఐశ్వర్య ఎస్పీ గరిమా మాలిక్ కు ఫోన్ చేసి పరిస్ధితి వివరించారు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగినప్పుడు పోలీసు ఫిర్యాదు చేయలేదని….కానీ ఈసారి ఫిర్యాదు చేశామని ఐశ్వర్యతండ్రి చంద్రికారాయ్ తెలిపారు. ఫిర్యాదు అందినవెంటనే విచారణ కోసం  ఓ పోలీసు బృందాన్ని రబ్రీదేవి ఇంటికి పంపించినట్లు డీఎస్పీ రాకేష్  ప్రభాకర్ తెలిపారు

బీహార్ మాజీ సీఎం దరోగా రాయ్‌ మనవరాలు అయిన ఐశ్వర్యరాయ్, తేజప్రతాప్ ల వివాహం 2018  మే 12న అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన ఏడు నెలల్లో వారిరిరువరూ విడాకుల కోరుతూ 2018 నవంబర్ లో   దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది.