రాఫెల్ డాక్యుమెంట్ : గోవా సీఎం బెడ్ రూమ్ లో
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూమ్లో ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినట్లు..కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా మీడియాకు తెలిపారు.

ఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూమ్లో ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినట్లు..కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ దీనికి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
గోవా క్యాబినెట్ మీటింగ్‌లో.. రాఫేల్ ఫైల్స్ గురించి పారికర్ ప్రస్తావించినట్లు..అవి తన బెడ్రూమ్లో ఉన్నట్లు చెప్పారని మంత్రి రాణే తెలిపారు. ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాఫేల్ డీల్‌కు సంబంధించిన సీక్రెట్లు పారికర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా సీఎం పదవి నుంచి తొలగించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే రాఫేల్‌పై కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతోందనీ..సుప్రీంకోర్టులో రాఫెల్ అంశంపై వచ్చిన తీర్పే దానికి నిదర్శనమనీ బీజేపీ విమర్శించింది. 36 రాఫేల్ విమానాల విషయంలో భారీ కుంభకోణం విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.