‘రాఫెల్’ స్కామ్ : మా ఊరి పేరు మార్చండి

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 11:24 AM IST
‘రాఫెల్’ స్కామ్ : మా ఊరి పేరు మార్చండి

రాఫెల్..రాఫెల్..రాఫెల్..యుద్ధ విమానాల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందంటు దేశం అంతా మారుమ్రోగిపోయింది. రాహుల్ గాంధీ ఈ రాఫెల్ స్కామ్ పై అధికారిపార్టీపై పార్లమెంట్ లోను..బైటా కూడా  విరుచుకుపడ్డారు. అధికార..విపక్షాల మధ్య ఈ రాఫెల్ పై కొన్నాళ్లు మాటల యుద్ధం జరగింది. 
 

గత పార్లమెంట్ సమావేశాలలో రాఫెల్ ప్రస్తావన లేని రోజు లేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా రాఫెల్… రాఫెల్… రాఫెల్. ఈ ప్రచారంతో ‘రాఫెల్’ అనే గ్రామంలో ఉంటున్న ప్రజలు విసిగిపోయారు. మా ఊరి పేరు మార్చమంటు గోల పెడుతున్నారు. ఈ రాఫెల్ స్కామ్ తో  మా ఊరిపేరు  పేరు అప్రతిష్టపాలైపోయిందంటు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మనస్తాపం చెందారు. అందుకే మా ఊరి పేరు మార్చండి మహాప్రభో అంటు వేడుకుంటున్నారు. డిమాండ్ చేస్తున్నారు.

 
ఛత్తీస్‌గడ్‌లోని మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గంలోని గ్రామం పేరు ‘రాఫెల్’. ఈ గ్రామంలో 200 కుటుంబాలపై ఉన్నాయి.  ఈ క్రమంలో రాఫెల్ స్కామ్ పేరుతో తమ గ్రామం పేరు వార్తాపత్రికల్లో, టీవీల్లో అప్రతిష్టపాలు కావడం చూసిన గ్రామస్తులు తమ ఊరి పేరు మార్చాలని సీఎం కలవడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి. కానీ ఆ డిమాండ్ ను మాత్రం విడిచిపెట్టటం లేదు ‘రాఫెల్’ గ్రామస్థులు.