రాఫెల్ స్పెషల్ ఇదే.. శత్రుదేశానికి వెళ్లకుండానే మట్టుబెట్టేయొచ్చు..

రాఫెల్ స్పెషల్ ఇదే.. శత్రుదేశానికి వెళ్లకుండానే మట్టుబెట్టేయొచ్చు..

రాఫెల్ వచ్చింది సరే. మరి.. రాఫెల్‌కు ముందు మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టామినా ఏంటి? రాఫెల్ వచ్చాక.. మన బలం ఎంతమేరకు పెరగనుంది.? ఈ అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్‌తో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏమేం చేయబోతోంది? ఈ క్వశ్చన్స్ అన్నింటిని ఆన్సరే.. ఈ స్పెషల్..

రాఫెల్ రానంత వరకు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీక్‌గా ఉందని కాదు అర్థం. కాకపోతే.. రాఫెల్ వచ్చాక మన వైమానిక దళం.. బలం కచ్చితంగా డబుల్ అయ్యిందని మాత్రం చెప్పొచ్చు. రాఫెల్ కంటే ముందు ఇండియా దగ్గర సుఖోయ్-30MKI, మిగ్-29, మిరాజ్-2000, ఇండియన్ మేడ్ తేజస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ.. శత్రుదేశాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఇవే సమాధానం చెప్పాయి.



వీటన్నింటితో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్ట్రాంగ్‌గానే ఉంది. ఇప్పుడా బలానికి.. రాఫెల్ కూడా తోడైంది. రాఫెల్‌తో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేయగలిగేది.. మిగతా ఫైటర్ జెట్స్ చేయలేనివి ఏంటన్నదే ఇక్కడ మేజర్ పాయింట్. అవే.. IAFని.. రాఫెల్‌కు ముందు.. రాఫెల్ తర్వాత ఏంటో చెప్పేస్తాయ్. ఇకపై.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి.. మన ఎయిర్‌ఫోర్స్ ఆ దేశ భూభాగంలోకి ఎంటరవ్వాల్సిన అవసరం లేదు.

శత్రుదేశానికి ఏమాత్రం డౌట్ రాకుండానే ఫైట్ చేసేయొచ్చు. మన గగనతలం నుంచే.. ముష్కర స్థావరాలపై మిస్సైల్స్ ఫైర్ చేయొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి మిషన్.. ఇంపాజిబుల్. కానీ.. రాఫెల్‌తో.. ఇప్పుడా మిషన్.. పాజిబుల్. సింపుల్‌గా చెప్పాలంటే.. బోర్డర్ దాటకుండానే ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు. ఇక.. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయ ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది. ఇప్పటికే ఇండియా దగ్గరున్న మిగతా ఫైటర్ జెట్స్‌తో పోలిస్తే.. మౌంటెయిన్ ఏరియాలో రాఫెల్ పనితీరులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇందులోని కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ కెపాసిటీ వల్ల.. లేహ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ.. వేగంగా మోహరించేందుకు వీలవుతుంది. ఒకవేళ.. భారత్-చైనా మధ్య యుద్ధం గనక యుద్ధమే వస్తే.. రాఫెల్ తన స్టైల్లో డీల్ చేస్తుంది. చైనా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈజీగా స్మాష్ చేస్తుంది.



శత్రుదేశం భూభాగంలోకి ప్రవేశించకుండానే.. అవతలి వైపు సుదూర ప్రాంతాల్లో.. దాడి చేయగల అస్త్రాలు రాఫెల్ దగ్గరుంటాయి. మెరుపువేగంతో దూసుకెళ్లే.. ఈ మిస్సైల్స్ నుంచి తప్పించుకోవడానికి.. ప్రత్యర్థికి చాన్సే లేదు. ఇవి.. అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటే.. ఇవి భారత్‌కు అందుతున్నాయి. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్లు ఫినిష్ చేయడానికి.. ఇందులో మీటియోర్ మిస్సైల్ ఉంటుంది. ఇది.. రాకెట్ రామ్‌జెట్ మోటార్‌తో పనిచేస్తుంది. అందువల్ల.. దీని కెపాసిటీ చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది.

మీటియోర్ మిస్సైల్.. 150 కిలోమీటర్ల దూరంలోని శత్రుదేశాల యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్‌ని ఫినిష్ చేసేస్తుంది. మన విమానం ఉనికిని.. శత్రుదేశం ఫైటర్ జెట్ కనిపెట్టే లోపే.. రాఫెల్ దానికి ఎండ్ కార్డ్ వేసేస్తుంది.

ఇక.. ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను ఫినిష్ చేసేందుకు.. రాఫెల్‌లో స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్ ఉంటుంది. ఇది.. 3 వందల కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది. ఎయిర్‌లో.. రాఫెల్‌కి దగ్గర్లో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చేందుకు.. మైకా మిస్సైల్ ఉంటుంది. దీని కెపాసిటీ 80 కిలోమీటర్లు. సైలెంట్ కిల్లర్‌గా మైకాను పిలుస్తారు. రాఫెల్‌లో హ్యామర్ మిస్సైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది.. 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు.

స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ సిస్టమ్.. రాఫెల్ ఎక్స్‌ట్రా ఫీచర్. ఇది.. శత్రుదేశాల రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో.. రాఫెల్ ఉనికిని దాచిపెడుతుంది. ఇందులో.. శక్తిమంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు, 360 డిగ్రీల్లోనూ శత్రు మిస్సైల్స్ రాకను పసిగట్టి.. పైలట్‌ని హెచ్చరించే సిస్టమ్స్ ఉన్నాయి. శత్రు దేశాల రాడార్లు, మిస్సైల్స్‌ని బోల్తా కొట్టించే ఫ్లేర్ అండ్ షాఫ్ డిస్పెన్సర్లు, టోడ్ డెకాయ్ సిస్టమ్ రాఫెల్‌లో ఉన్నాయి. వీటన్నింటి వల్ల.. రాఫెల్ ప్రత్యర్థిపై దాడి చేసి.. అజేయంగా తిరిగి రాగలదు.



రాఫెల్ కాక్‌పీట్ కూడా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో.. హోలోగ్రఫిక్ కాక్‌పీట్ డిస్‌ప్లే సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీనివల్ల.. ఫైటర్ జెట్ కంట్రోలింగ్, మిషన్ డేటా నిర్వహణ, మిస్సైల్స్ ఫైరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. పైలట్‌ తన తలను కిందకు దించాల్సిన అవసరం లేకుండానే.. కీలక సమాచారాన్ని అందించే హెడ్ అప్ డిస్‌ప్లై సిస్టమ్ ఇందులో ఉంది. గాల్లోనే ఇంధనం నింపుకోవడం రాఫెల్‌కు ఉన్న మరో స్పెషాలిటీ. అవసరమైతే.. సహచర ఫైటర్ జెట్స్‌కి కూడా ఇది ఇంధనాన్ని నింపగలదు. దీని రెక్కలు కూడా డెల్టా ఆకృతిలో ఉంటాయ్. అందువల్ల.. ఇది చాలా మెరుగ్గా విన్యాసాలు చేస్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్‌లోనూ.. స్థిరంగా ఉంటుంది.

ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ లాంటి దేశాల దగ్గర రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయ్. ఐతే.. ఇప్పుడు ఇండియా దగ్గరున్నవి మరింత అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి మరిన్ని సిస్టమ్స్ కొనుగోలు చేసి.. వీటికి అమర్చారు. దీంతో.. దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా డబుల్ అయ్యింది. గగనతల రక్షణ, సైన్యానికి సపోర్ట్, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం, నిఘా, యుద్ధ నౌకల విధ్వంసం లాంటివన్నీ.. రాఫెల్ చేస్తుంది. అంతేకాదు.. శత్రువుల రాడార్లను జామ్‌ చేయడంతో పాటు సముద్రం, నేల, నింగిలోనూ ప్రత్యర్థులను పసిగడుతుంది. అందుకే.. రాఫెల్‌ని మల్టీరోల్ ఫైటర్ జెట్ అంటారు.