Katihar Fat Man: రోజూ ఇలాగే.. 15మంది తిండిని ఒక్కడే లాగించేసే వ్యక్తి

అతనొస్తున్నాడంటే చాలు గిన్నెలన్నీ ఖాళీ.. ఏకధాటిగా కిలోలు కొద్దీ లాగించేసే ఆ వ్యక్తిని చూస్తే అందరికీ హడల్. అందుకే ఫంక్షన్లకు కూడా రాకూడదని కోరుకుంటున్నారు. తనకు ఉన్న వింత సమస్య కారణంగా బాగా తిని.. తిని 200కేజీలు బరువు పెరిగాడు.

Katihar Fat Man: రోజూ ఇలాగే.. 15మంది తిండిని ఒక్కడే లాగించేసే వ్యక్తి

Katihar Fat Man

Katihar Fat Man: అతనొస్తున్నాడంటే చాలు గిన్నెలన్నీ ఖాళీ.. ఏకధాటిగా కిలోలు కొద్దీ లాగించేసే ఆ వ్యక్తిని చూస్తే అందరికీ హడల్. అందుకే ఫంక్షన్లకు కూడా రాకూడదని కోరుకుంటున్నారు. తనకు ఉన్న వింత సమస్య కారణంగా బాగా తిని.. తిని 200కేజీలు బరువు పెరిగాడు.

బీహార్ లోని కటిహార్ జిల్లాలో జయనగర్ ప్రాంతంలో ఉంటాడు ఈ రఫీక్ అద్నాన్. ఒక్క రోజులో నాలుగు కిలోల పిండితో చేసిన రోటీలు, 3కేజీల రైస్, రెండు కిలోల చికెన్, కిలోన్నర చేపలు, 3లీటర్ల పాలు తీసుకోనిదే మెనూ పూర్తి కాదు. ఇక ఇంత తిన్న తర్వాత నడవగలడా అంటే అదీ లేదు. ఈయన బరువుకు రయ్ మంటూ దూసుకెళ్లే బుల్లెట్ కూడా అప్పుడప్పుడు నా వల్ల కాదని నిలబడిపోతుంది.

ఇది స్వతహాగా వచ్చినది కాదట. బులీమియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడుతుండటం వల్ల అతిగా తినేసే సమస్య ఉంటుందట. ఈ స్థూలకాయంతో సతమతమవుతున్న రఫీక్ కు ఇద్దరు భార్యలుండగా పిల్లలు లేరు. ఇతని ఆకలికి భయమేసి చుట్టుపక్కల గ్రామాల్లో వారెవ్వరూ అంతా తినేస్తాడని భయపడి ఫంక్షన్లకు కూడా పిలవడం లేదు.

Read Also: రెండేళ్ల వయస్సున్న పాప బరువు 45కిలోలు!!

రఫీక్ కు ధాన్యం వ్యాపారం ఉంది. వ్యవసాయం కూడా చేస్తున్న అతనికి ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవట.