Rahulgandhi twitter: ఇంధన ధరలపై రాష్ట్రాలను నిందిస్తారా? ప్రధాని మోదీని నిలదీసిన రాహుల్..

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెంచేది మీరు, తగ్గించాల్సింది రాష్ట్రాలా? అంటూ ...

Rahulgandhi twitter: ఇంధన ధరలపై రాష్ట్రాలను నిందిస్తారా? ప్రధాని మోదీని నిలదీసిన రాహుల్..

Rahul Gandi

Rahulgandhi twitter: పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెంచేది మీరు, తగ్గించాల్సింది రాష్ట్రాలా? అంటూ నిలదీశారు. గురువారం ట్విటర్ వేదికగా మోదీ వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. అధిక ఇంధన ధరలకు రాష్ట్రాలను నిందిస్తారు, బొగ్గు కొరతకు రాష్ట్రాలను నిందిస్తారు, ఆక్సిజన్ కొరతకు రాష్ట్రాలను నిందిస్తారు.. ఇదేనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరించాల్సిన తీరు అంటూ మోదీని ప్రశ్నించారు. ఇంధన పన్నుల్లో 68శాతం కేంద్రం తీసుకుంటుందని, అయినా ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతల నుంచి తప్పుకుంటూ రాష్ట్రాలకు పన్నులు తగ్గించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని రాహుల్ అన్నారు.

ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై.. భాజపాయేతర రాష్ట్రాలు మండిపడ్డాయి. పెట్రోల్, డీజిల్‌పై ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచి.. రాష్ట్రాలను పన్నులు తగ్గించమనడం దారుణమని వ్యాఖ్యానించాయి. ప్రధాని వ్యాఖ్యలపై బుధవారం జరిగిన తెరాస పార్టీ ప్లీనరీలో సీఎం కేసీఆర్ స్పందించారు. కరోనా పేరుతో సమావేశమని పిలిచి ఇంధన ధరలపై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని అనడం సమంజసంగా లేదని అన్నారు. కేంద్రం పన్నులు పెంచుతూ.. రాష్ట్రాలను తగ్గించమని ఏ నోటితో అంటారు అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏ ఒక్కరోజు కూడా డీజిల్, పెట్రోల్ పై పన్ను పెంచలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెట్రో ఉత్పత్తులపై విలువ ఆదారిత పన్ను(వ్యాట్) తగ్గించాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని కోరారు. ‘గత ఏడాది నవంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను తగ్గించాలని, ఆ మేరకు తమ పరిధిలో వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అయితే బీజేపీ రాష్ట్రాల్లో వ్యాట్ ను తగ్గించగా ప్రతిపక్ష పార్టీల పాలనలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆ విన్నపాన్ని పట్టించుకోలేదు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించిన మోదీ.. ఇది ఒకరకంగా ఆ రాష్ట్రాల ప్రజలను మోసం చేసినట్లేనని, ఆయా ప్రభుత్వాలు ఇకనైనా వ్యాట్‌ను తగ్గించి సొంత ప్రజల ప్రయోజనాలను కాపాడాలని, ఈ ఆరు నెలల్లో ఆర్జించిన అదనపు ఆదాయం చాలంటూ మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించారు. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రాలకు మద్దతుగా మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేశారు.