2004 రిపీట్…రాహుల్ ప్రధాని అవుతారు

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 11:02 AM IST
2004 రిపీట్…రాహుల్  ప్రధాని అవుతారు

జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో షైన్ ఇండియా అంటూ క్యాంపెయిన్ చేసిన బీజేపీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది.అప్పుడు వాజ్ పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు మోడీ ఎదుర్కొనబోతున్నాడు.తదుపరి ప్రధాని ఎవరనేది లీడర్లు నిర్ణయిస్తారు.ఏ పార్టీ లీడ్ చేస్తుందానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది.ఒక వేళ అది కాంగ్రెస్ అయితే తదుపరి ప్రధాని  రాహుల్ గాంధీ అవుతారని ఆయన అన్నారు.

తాము కొన్ని పార్టీలతో ప్రీ-పోల్ అలయన్స్ కుదర్చుకున్నామని,ఎన్నికల తర్వాత సంకీర్ణ కూటమి ఏర్పాటు ఉంటుందని,ఇదంతా ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని శర్మ తెలిపారు.మోడీ,ఇతర బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని శర్మ అన్నారు.ఇద్ది సిగ్గుమాలిన చర్య అన్నారు.దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రధానమంత్రి…పక్షపాత పొలిటకల్ అజెండా కోసం భద్రతా బలగాలను ఉపయోగించుకుంటున్నారన్నారు.ఇండియన్ ఆర్మీ… మోడీ ప్రభుత్వానికి చెందినది కాదని,దేశానికి,ప్రజలకు చెందినదని శర్మ అన్నారు.దేశ సేవలో ప్రాణాలు ఇద్దరు ప్రధానులను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాదంపై పోరాటం గురించి బీజేపీ పాఠాలు చెప్పనవసరం లేదని శర్మ అన్నారు.