Bharat Jodo Yatra: జోడో యాత్రలో సైక్లిస్టుగా మారిన రాహుల్.. వీడియో వైరల్.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ..

రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇండోర్‌కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్‌గా మారారు. సైకిల్ ఎక్కి తొక్కుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.

Bharat Jodo Yatra: జోడో యాత్రలో సైక్లిస్టుగా మారిన రాహుల్.. వీడియో వైరల్.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోవ్ నుంచి ఇండోర్ లోకి ప్రవేశించింది. 82వ రోజు ఇండోర్‌లో రాహుల్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో పాల్గొని రాహుల్ వెంట నడిచారు. సోమవారం ఉదయం 6 గంటలకు బడాగణేష్ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమైంది. ఉదయం 10గంటలకు బొరోలికి చేరుకుంది. అక్కడ చిరు వ్యాపారులు, కూలీలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.

Bharat Jodo Yatra: బుల్లెట్ ఎక్కిన రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. (ఫొటోలు)

వ్యాపారులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ గాంధీ అడిగితెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలన్నింటి పరిష్కరించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే మధ్యాహ్నం 3.30 గంటలకు క్రిష్ణా ఎన్‌క్లేవ్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు తారానలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి తారానాలో రాహుల్ బస చేస్తారు.

ఇదిలాఉంటే రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇండోర్‌కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్‌గా మారారు. సైకిల్ ఎక్కి  తొక్కుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. రాహల్ సైకిల్ తొక్కే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాహుల్ సైకిల్ తొక్కుతుండగా పార్టీ శ్రేణులు పూలు చల్లుతూ జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ అంటూ నినాదాలు చేశారు.