Updated On - 4:08 pm, Thu, 25 February 21
Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్ మార్చారు. ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్ అవుతున్నారు. లాల్చీల ప్లేస్‌లో హాఫ్ హ్యాండ్ టీషర్ట్‌లు వేస్తున్నారు. ఒక్కోసారి ఇన్‌షర్ట్ చేసి కొత్త స్టైల్‌లో కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ.
తాజాగా కేరళలోని వాయనాడ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ.. స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ఆ తర్వాత మత్స్యకారులతో కలసి పడవపై వెళ్లి చేపలు పట్టే వలను విసిరారు. ఇటీవల తమిళనాడు పర్యటన నిమిత్తం వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోకి కళా పోషణను బయటకు తీశాడు. పాకశాస్త్రంలో పరీక్షించుకున్నారు. విలేజ్ కుకింగ్ ఛానల్ యూట్యూబ్‌లో టీమ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సరదాగా వారితో కలిసి గరిటతిప్పారు. ఆ తర్వాత మష్‌రూమ్ బిర్యానీని స్థానికులతో కలిసి భోజనం చేశారు.
రాహుల్ గాంధీలో వచ్చిన ఛేంజ్ చూసి.. కాంగ్రెస్ నేతలే ఆయనను గుర్తు పట్టలేకపోతున్నారు. అయితే యూత్‌ను టార్గెట్ చేసుకుని.. వాళ్లలో ఒకడిలా కలిసిపోవాలన్నదే రాహుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌గా కనిపిస్తోంది. యూత్ ఓట్లు పెరుగుతుండడం.. వాళ్లకు దగ్గరైతేనే ఫ్యూచర్ ఉంటుందని రాహుల్ నమ్మినట్లుగా తెలుస్తోంది. లాల్చీ పైజామాలు వేసి పక్కా పొలిటీషియన్‌గా కనిపించడం కన్నా.. నేచురల్ లుక్‌లో జనంలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆయన భావిస్తున్నారట.
Master kidnaped student : విద్యార్ధినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న డ్రిల్ మాస్టార్
Tamilnadu girl raped : 14 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా అత్యాచారం – 12 మంది అరెస్ట్
Superpowers Illusion: మరో మహిళను పెళ్లాడి.. కన్నకొడుకులనే బలి ఇవ్వాలని ప్లాన్
Kerala Scientists : గాలి ద్వారా కరోనాకు చెక్..సైంటిస్టుల కొత్త పరికరం
Bank Manager found dead : పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు మేనేజర్ బలవన్మరణం
One Crore Lottery : అదృష్టవంతుడు.. 100 రూపాయలతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డు