Rahul Gandhi: మోదీకి ధైర్యాన్ని, ప్రేమను ఇస్తూ అండగా నిలిచిన రాహుల్ గాంధీ

ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Rahul Gandhi: మోదీకి ధైర్యాన్ని, ప్రేమను ఇస్తూ అండగా నిలిచిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ సమయంలో ఆయనకు ధైర్యంతో పాటు తన ప్రేమను పంచుతున్నానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయమై మోదీకి రాహుల్ అండగా నిలిచారు. మోదీ తల్లి తొందరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్.. తల్లీకొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేదని అన్నారు.

ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

తల్లి హీరాబెన్‎ను పరామర్శించిన ప్రధాని మోదీ

‘‘తల్లీ కొడుకుల మధ్య ప్రేమకు వెలకట్టేం. మోదీజీ.. ఈ కఠిన సమయంలో మీకు నా ప్రేమను ఇవ్వడంతో పాటు మీకు నేను అండగా ఉంటాను. మీ తల్లి అతి తొందరలో కోలుకుని మామూలు స్థితికి వస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’’ అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. హీరాబెన్ మోదీ 1923 జూన్ 18న జన్మించారు. తల్లి హీరాబెన్‌కు అనారోగ్యం దృష్ట్యా ప్రధాని అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది. అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ తల్లి అనారోగ్యవార్త తెలుసుకున్న తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు.