సుప్రీంకోర్టును క్షమాపణలు కోరిన రాహుల్ గాంధీ

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 10:15 AM IST
సుప్రీంకోర్టును క్షమాపణలు కోరిన రాహుల్ గాంధీ

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో రాహుల్ వెనక్కి తగ్గారు. సుప్రీం తీర్పును వక్రీకరించానని అంగీకరించారు. తాను చేసిన ప్రకటనలో పొరపాటు ఉందన్నారు. ప్రధాని చౌకీదార్ చోర్ అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అంశానికి సంబంధించి కోర్టు ధిక్కరణ నోటీసులకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరపున అభిషేక్ మన్ సింగ్ వాదనాలు వినిపించారు. 

ఒక చోట అఫిడవిట్ లో తాను ఈ వాఖ్యలు చేయలేదని పేర్కొనగా మరో చోట తాను చింతుస్తానని పేర్కొనడం ద్వంద్వ వైఖరి అంటూ ముఖుల్ రోహత వాదనలు వినిపిస్తూ వీటిని తిరస్కరించాలంటూ వాదానలు వినిపించారు. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చేప్పాల్సిందేనని సీజేఐ రంజన్ గొగోయ్ చెప్పారు. రాహుల్ మరో అఫిడవిట్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ అఫిడవిట్ లో ఉన్న తప్పిదాలను మన్నించాలని అభిషేక్ మన్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మే 6న మరో అఫిడవిట్ దాఖలు చేయాలని రాహుల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 6వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.