Rahul Gandhi: పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ.. సెషన్స్ కోర్టులో రాహుల్ పిటీషన్ ..

పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్‌లో రాహుల్ కోరారు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ.. సెషన్స్ కోర్టులో రాహుల్ పిటీషన్ ..

Rahul Gandhi

Rahul Gandhi: పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్‌లో రాహుల్ కోరారు. కేసు తేలే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పిటీషన్ సోమవారం విచారణ జరగనుంది. దీంతో రాహుల్ సోమవారం సూరత్ వెళ్లే అవకాశాలున్నాయి.

Rahul Gandhi : లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత.. తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమైన రాహుల్ గాంధీ

దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అని కర్ణాటక కోలార్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేశారు. 2019లో కేసుకుసంబంధించి సూరత్ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, బెయిల్ మంజూరు చేస్తూనే, తీర్పుపై అప్పీల్ చేయడానికి అతని శిక్షను 30రోజుల పాటు నిలిపివేశారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు

సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తు మార్చి 23న లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం విధితమే. అనర్హత వేటు నుంచి బయటపడేందుకు, పరువునష్టం కేసు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటీషన్ లో రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును కోరారు. ఈ పిటీషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సోమవారం సూరత్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.