Rahul gandhi : డబ్ల్యూహెచ్ఓ నివేదికపై స్పందించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్ అవాస్తవాలు చెబుతుంది..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కొవిడ్ భారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది మృతి చెందారు. ప్రస్తుతం....

Rahul gandhi : డబ్ల్యూహెచ్ఓ నివేదికపై స్పందించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్ అవాస్తవాలు చెబుతుంది..

Rahul

Rahul gandhi : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కొవిడ్ భారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది మృతి చెందారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా కొవిడ్ మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికను వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం.. భారత్ లో 47లక్షల మంది కొవిడ్ భారిన పడి మృతిచెందినట్లు పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కొవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై స్పందించారు. కొవిడ్ మరణాల విషయంలో గణాంకాలు అబద్ధం చెప్పవని, ప్రజలను మభ్య పెట్టడానికి మోదీనే తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. డబ్ల్యూహెచ్ఓ ఇటీవల విడుదల చేసిన నివేదికను ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును రాహుల్ తప్పుబట్టారు. భారత్ లో మొత్తం 4.7మిలియన్ల మంది కరోనాతో మృత్యువాత పడితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలను చూపించిందని విమర్శించారు. కొవిడ్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం చెల్లించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నివేదికలను తప్పు పట్టడం మాని కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.