Rahul Gandhi : ప్రధాని ఘనత..కనిష్ఠ జీడీపీ,గరిష్ఠ నిరుద్యోగం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.

Rahul Gandhi : ప్రధాని ఘనత..కనిష్ఠ జీడీపీ,గరిష్ఠ నిరుద్యోగం

Rahul Gandhi Attacks Pm On Gdpunemployment

Rahul Gandhi ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. 2020-21 ఆర్థికసంవత్సరంలో దేశ జీడీపీ -7.3శాతంగా నమోదైనట్లు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం(NSO)విడుదల చేసిన డేటాపై మంగళవారం ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు.

పీఎం హాల్ ఆఫ్ షేమ్.. కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం అని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. నిరుద్యోగానికి సంబంధించిన ఓ గ్రాఫ్ ​ను కూడా రాహుల్ ట్వీట్టర్ లో షేర్ చేశారు. 2014 నుంచి క్రమంగా నిరుద్యోగం భారీ స్థాయికి పెరిగనట్లు ఆ గ్రాఫ్ తెలియజేస్తోంది.

అంతకుముందు, బ్లాక్ ఫంగస్​ వ్యాధిపై రాహుల్ గాంధీ.. ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ​ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల కొరతపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. పేషెంట్ ఈ మెడిసిన్ పొందాల్సిన పద్ధతులు ఏంటని రాహుల్ ప్రశ్నించారు. బ్లాక్​ ఫంగస్​ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తున్నారని నిలదీశారు. రాహుల్ ట్వీట్ అనతంరం..బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ​ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిని బ్యాన్ చేస్తున్నట్లు ఇవాళ కేంద్రం ప్రకటించింది.