Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్

బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తూ అక్కడున్న వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సమయంలోనే ఝలావర్ లో ఆయన పాదయాత్ర చేస్తుండగా, బీజేపీ కార్యాలయం కనపడింది. దీంతో అక్కడున్న వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చారు.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్

Viral Video

Viral Video: బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తూ అక్కడున్న వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సమయంలోనే ఝలావర్ లో ఆయన పాదయాత్ర చేస్తుండగా, బీజేపీ కార్యాలయం కనపడింది.

దీంతో అక్కడున్న వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయ భవనంపై ఉన్న కొందరు రాహుల్ గాంధీకి బీజేపీ జెండాలు చూపారు. ఆ సమయంలోనే వారికి ప్రేమని పంచుతున్నట్లు రాహుల్ ముద్దులు విసిరారు. అనంతరం ఆయన పక్కన ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని, తాము ప్రేమను పంచుతామని రాహుల్ గతంలో చాలాసార్లు చెప్పారు. రాజస్థాన్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకున్నారు. తాము పాదయాత్ర చేస్తోంది 2024 ఎన్నికల కోసం కాదని, దేశ ప్రజలను ఏకం చేసేందుకేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!