ఇంచు కూడా కదలొద్దు..ఆందోళన కొనసాగించాలని రైతులకు రాహుల్ సూచన

ఇంచు కూడా కదలొద్దు..ఆందోళన కొనసాగించాలని రైతులకు రాహుల్ సూచన

Don’t budge an inch’ తన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల వెనుక తాము ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సృష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఒక్క ఇంచు కూడా కదలవద్దు అని..ఆందోళన కొనసాగించాలని..మేము మీ వెంట ఉన్నాం అని రైతులకు రాహుల్ భరోసా ఇచ్చారు.

ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో జరిగిన హింసపై ఓ ప్రశ్నకు స్పందిస్తూ…50మంది రైతులు ఎర్రకోట్ట వద్దకు చేరుకునేందుకు ఎవరు అనుమతించారు..వాళ్లను ఎందుకు ఆపబడలేదు?ఎర్రకోట పరిసరాల్లోకి వాళ్లను వదలడం వెనుక ఉన్న లక్ష్యం ఏంటో హోం మంత్రిని అడగండి అని రాహుల్ సమాధానమిచ్చారు. ఢిల్లీ హింసకు కేంద్రమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా,గురువారం రాత్రి రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో..ఎటువైపు ఉండాలో అన్నదానికి సమయం వచ్చింది. నా నిర్ణయం సృష్టం. ప్రజస్వామ్యం,రైతులు మరియు వారి శాంతియుత ఆందోళన వైపే నేను ఉంటాను అని తెలిపారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని రైతుల ఆందోళన ప్రాంతాలను ఖాళీ చేయించాలి అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లా యంత్రాగాలని ఆదేశించిన నేపథ్యంలో రాహుల్ ఈ కామెంట్ప్ చేశారు.

గురువారం సాయంత్రం ఘజియాబాద్ జిల్లాలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద హై డ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ హింస కేసులో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయిత్ పేరుని ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదుచేయగా..పోలీసులకు సరెండర్ అయ్యేందుకు ఆయన నిరాకరించారు. మీడియా ఎదుట రాకేష్ తికాయిత్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ప్రాంతాన్నివదిలి వెళ్లేందుకు నిరాకరించారు. తాను ఉరి అయినా వేసుకుంటాను గానీ..సరెండర్ మాత్రం అవనని తేల్చిచెప్పారు ఇక,ఆ రాత్రే అక్కడ మోహరించిన పెద్ద సంఖ్యలో బలగాలను ఉపసంహరించారు పోలీస్ అధికారులు.