కేసులను పతకాలుగా భావిస్తా…మోడీ,షా సొంత ఊహల్లో జీవిస్తున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : December 5, 2019 / 10:40 AM IST
కేసులను పతకాలుగా భావిస్తా…మోడీ,షా సొంత ఊహల్లో జీవిస్తున్నారు

బీజేపీ దేశ వ్యాప్తంగా తనపై పెడుతున్న కేసులను చూసి భయపడేది లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆ కేసులను తాను పతకాల లాగా చూస్తానని ఆయన అన్నార

ఇవాళ కేరళలో పర్యటించిన రాహుల్ వన్యంబలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సమావేశంలో మాట్లాడుతూ… తనపై దాదాపు 15 నుంచి 16 కేసులు ఉన్నాయన్నారు. సైనికుడిని పరిశీలిస్తే, ఆయన మెడలో చాలా పతకాలు ఉంటాయన్నారు. తనపై నమోదైన ప్రతి కేసు తనకు ఓ పతకం వంటిదన్నారు. అవి ఎంత ఎక్కువైతే, తాను అంత సంతోషంగా ఉంటానని చెప్పారు. తాను వాటితో సైద్ధాంతికంగా పోరాడతానన్నారు.

తాను విద్వేషపూరిత భారత దేశాన్ని నమ్మబోనని చెప్పారు. తనకు నచ్చజెప్పడానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా, తాను విశ్వసించబోనని తెలిపారు. మహిళలను, అన్నిమతాలవారిని, జాతులవారిని, విభిన్న ఆలోచనలుగలవారిని గౌరవించడంలోనే భారత దేశం బలం ఉందని చెప్పారు. తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ తాను ప్రేమపూర్వకంగా మాట్లాడతానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచినవారిని ఎన్నటికీ మర్చిపోనన్నారు.

దేశ ఆర్థికస్థితిపై రాహుల్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా తమ సొంత ఊహల్లో బతుకుతున్నారని,బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సొంత ప్రంచంలోనే వాళ్లు బతుకుతున్నారన్నారు. అందుకే దేశం ఇలాంటి సమస్యలో ఉందని రాహుల్ అన్నారు.