Political
కాంగ్రెస్ సంచలన నిర్ణయం : కేరళ నుంచి రాహుల్ పోటీ
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్
Publish Date - 11:43 am, Sat, 23 March 19
By
veegamteamకాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్ గాంధీ.. దక్షిణాది నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వస్తుందని కేరళ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కేరళలోని ఓ స్థానం నుంచి పోటీ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఊమెన్ చాందీ.. రాహుల్‌ను కోరారు. దీనిపై రాహుల్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని యూడీఎఫ్ పక్షాలు ఆశిస్తున్నాయి. కర్నాటక నుంచి కూడా పోటీ చేయాలని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ దినేశ్ గుండూ రావు సైతం రాహుల్‌ను అభ్యర్థించారు.
Read Also : తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్
రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలంటూ ఫేస్ బుక్‌లోనూ పెద్ద ఎత్తున రిక్వెస్ట్ లు వస్తున్నాయి. రాహుల్.. దక్షిణాది నుంచి రెండో స్థానంలో బరిలోకి దిగుతారనే వార్తలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఫైనల్ గా రాహుల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఎస్ అంటారో, నో అంటారా తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వయనాడ్ మరో స్థానానికి అభ్యర్థులను మాత్రం పెండింగ్ లో ఉంచారు. వయనాడ్ నుంచి కోజికోడ్ డీసీసీ ప్రెసిడెంట్ సిద్దిఖీని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించింది. రాహుల్ గాంధీ కోసం ఆ నిర్ణయాన్ని ఆపేశారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తానంటే తాను బరి నుంచి తప్పుకుంటానని సిద్దిఖీ చెప్పారు.
Rahul Gandhi : ఎన్నికల ప్రచారం నిర్వహించను..సభలు పెట్టను – రాహుల్ కీలక నిర్ణయం
Sonia Gandhi : కరోనాపై పోరుకు కేంద్రం సంసిద్దంగా లేదు..25ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్
Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ సెటైర్లు : స్టేజ్-1 తుగ్లక్ లాక్డౌన్,స్టేజ్-2 గంట కొట్టడం,స్టేజ్-3 దేవుడిని ప్రార్ధించడం
Sonia Gandhi: వ్యాక్సిన్లను విదేశాలకు పంపి దేశంలో కొరత వచ్చేలా చేశారు – సోనియా
Rahul Gandhi : ఏ కల పెద్దది కాదు, చిన్నారిని ఫ్లైట్ ఎక్కించిన రాహుల్..వీడియో వైరల్
West Bengal Elections : మమతా రెండోచోట పోటీ చేయడం లేదు.. నందిగ్రామ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారు : టీఎంసీ