Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు
కాంగ్రెస్ హయాంలో బలోపేతం చేసిన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుత మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, అధికార భాజపాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో బలోపేతం చేసిన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుత మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లా కరణ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విభజించారని, ఒకటి ధనికుల కోసం మరొకటి పేదల కోసం అంటూ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్..బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని అన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగానే నేడు ఆర్ధిక వ్యవస్థ నాశనం అయిందని రాహుల్ అన్నారు.
Other Stories:Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!
యూపీఏ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేశామని..అందుకే ఇప్పటికీ దేశాన్ని ముందుకు నడిపించగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలు నమ్ముతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ నేతలకు తాను భయపడబోనని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతానని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుందని అన్నారు. భారత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజల మధ్య చర్చకు దారి తీసే అంశాలను బీజేపీ క్రమపద్ధతిలో నాశనం చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో దేశంలో సంస్థలు విచ్చిన్నాన్ని ఎదుర్కొంటున్నాయని, ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణంగా జీవన ప్రమాణాలు కాస్త జీవన ప్రమాదాలుగా మారుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
Other Stories:Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
1GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800కోట్ల డబ్బు మాయం
2Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
3Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
4Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
6Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
7Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
8Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
9prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
10Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్