Rahul Gandhi: పంజాబ్‌ను ఢిల్లీ నుంచి నడపకూడదు.. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు

దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉంది. పంజాబ్‌ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలి. పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ఒకరి రిమోట్ కంట్రోల్‌లో పాలన నడవకూడదు అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు.

Rahul Gandhi: పంజాబ్‌ను ఢిల్లీ నుంచి నడపకూడదు.. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో కొనసాగిన యాత్రకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యాత్రలోపాల్గొన్నారు. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీపై రాహుల్ విమర్శలు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ప్రభుత్వమని రాహుల్ విమర్శించారు. ప్రజలకోసం సీఎం కుర్చీలో ఉండి ఆయన ఏమీ చేయలేరని, ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలు మాత్రమే ఇక్కడ పనిచేస్తాయని రాహుల్ పంజాబ్ సీఎంను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.

Priyanka Gandhi: ఆ సమయంలో అమ్మ చాలా కష్టపడింది.. ఇందిరా, సోనియా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియాంక

దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉందని, పంజాబ్ ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలని, పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదని అన్నారు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదని, పంజాబ్ పాలన సక్రమ మార్గంలో నడవాలంటే ఒకరి రిమోట్ కంట్రోల్ లో పాలన నడవకూడదని రాహుల్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ ప్రభుత్వమని రాహుల్ విమర్శించారు.

Rahul Gandhi Bharat Jodo Yatra: హర్యానాలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ

రద్దుచేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతూ.. పార్లమెంట్ లో రెండు నిమిషాలు మౌనం పాటించాలని నేను కోరానని, అయితే ఎవరూ అమరులయ్యారని ప్రభుత్వం చెప్పిందని రాహుల్ గుర్తు చేశారు. కానీ ఏడాది తర్వాత ప్రధాని క్షమాపణలు చెప్పారని, తప్పు జరిగిందని ఒప్పుకున్నారని రాహుల్ గుర్తు చేశారు. దేశంలోని మీడియాకు రాహుల్ చురకలంటించారు. 24గంటలపాటు టీవీల్లో మోదీ ముఖం చూస్తున్నాం.. ద్రవ్వోల్బణం గురించి ఎప్పుడైనా మీడియాలో విన్నారా అంటూ రాహుల్ సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి అన్నారు. డీమోనిటైజేషన్ పై మాట్లాడలేం, ద్రవ్వోల్బణం గురించి మాట్లాడలేం.. ఇది భారతదేశంలోని మీడియా పరిస్థితి అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.