Rahul Gandhi : ట్రాక్టర్ పై పార్లమెంట్ కి వచ్చిన రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై పార్లమెంటుకు వచ్చారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ కి వచ్చిన రాహుల్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.

Rahul Gandhi : ట్రాక్టర్ పై పార్లమెంట్ కి వచ్చిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై పార్లమెంటుకు వచ్చారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ కి వచ్చిన రాహుల్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.

ఇక పార్లమెంట్ లో ఈ అంశంపైనే చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్ సభ, రాజ్యసభలో వ్యవసాయ చట్టాలు, పెగాసెస్ పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ సజావుగా కొనసాగనివ్వాలని తెలిపారు.

మరోవైపు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న నిరసన 8 నెలలుగా కొనసాగుతుంది. రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాలకు చెందిన అనేక మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇక తాజాగా 200 మంది రైతులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు చట్టాలను రద్దు చేస్తే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని వివరించింది.