Rahul Gandhi : పరువు నష్టం కేసు.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

రాహుల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకవేళ పైకోర్టులో గనుక ఆ తీర్పుపై స్టే వచ్చినట్లైతే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది.

Rahul Gandhi : పరువు నష్టం కేసు.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరు వివాదంపై రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది.

సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ సెషన్ కోర్టును ఆశ్రయించారు. సెషన్ కోర్టులోనూ రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను సెషన్ కోర్టు కొట్టివేసింది. పిటిషన్ ను సెషన్ కోర్టు కొట్టివేయడంతో మంగళవారం రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు తలుపుతట్టారు.

Rahul defamation case: రాహుల్ గాంధీ రెండేళ్ల జైలు శిక్ష స్టేపై ఉత్కంఠ.. కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ పిటిషన్

మోదీ ఇంటి పేరు కలిగివున్న వారంతా దొంగలు ఉన్నారంటూ 2019లో ఎన్నికల సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మార్చి 23న సూరత్ మున్సిపల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ఖరారు చేస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీ సభ్యత్వానికి అనర్హుడయ్యారు.

అలాగే, ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసాన్ని సైతం ఇప్పటికే రాహుల్ ఖాళీ చేసి సోనియా గాంధీ నివాసానికి మారాల్సివచ్చింది. ఒకవేళ పైకోర్టులో గనుక ఆ తీర్పుపై స్టే వచ్చినట్లైతే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది. గతంలో లక్షద్వీప్ కు సంబంధించిన విషయంలో కూడా ఇదే జరిగింది.

Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రాహుల్ పిటిషన్ తిరస్కరణ

రాహుల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సెషన్ కోర్టులో ఊరట లభించకపోవడంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టులోనైనా రాహుల్ గాంధీకి ఊరట దక్కుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.