Rahul Gandhi : కీలక సమయంలో..ఇటలీకి రాహుల్

వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌,

Rahul Gandhi : కీలక సమయంలో..ఇటలీకి రాహుల్

Rahul

Rahul Gandhi :  వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటివారంలో షెడ్యూల్‌ విడుదలఅయ్యే అవకాశముంది. అయితే ఇప్పటికే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రచార జోరును పెంచగా,కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పెద్దగా ప్రచారాన్ని తీవ్రతరం చేయలేదు.

పైగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతున్నా విషయం తెలిసిందే. మరోవైపు,ఒమిక్రాన్ తో పాటు కోవిడ్ కేసులు కూడా దేశంలో పెరుగుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటలీకి వెళ్లారు. బుధవారం ఉదయం 4గంటల సమయంలో వయా దోహ మీదుగా రాహుల్ ఇటలీ వెళ్లారు. అయితే రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే సందర్భాల్లో రాహుల్‌ విదేశాలకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ ఇటలీ పర్యటన బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారీ తీసింది. రాహుల్ కి బాధ్యత లేదని బీజేపీ విమర్శించింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ రాహుల్ ఇటలీ పర్యటనకు వెళ్లడం బాధ్యతారాహిత్యం కాక మరేమిటని బీజేపీ విమర్శించింది. రాహుల్ పర్యటనపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తమే రాహుల్‌ గాంధీ ఇటలీకి వెళ్లారని, బీజేపీ, దాని మిత్రులు అనవసర రూమర్లు ప్రచారం చేయొద్దని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా కోరారు.

కాగా, ఈ ఏడాది రాహుల్‌ గాంధీ నాలుగుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. మొత్తం 25 రోజులు విదేశాల్లో గడిపారు. కాగా, 2015 నుంచి 2019 మధ్య కాలంలో రాహుల్ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని గతంలో అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. పర్యటనల సమయంలో ఆయన ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని విమర్శించారు.

ALSO READ China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా