రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

  • Published By: venkaiahnaidu ,Published On : April 19, 2019 / 03:42 PM IST
రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం(ఏప్రిల్-19,2019) ఎలక్షన్ కమిషన్  నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. 

 అబ్ హోగా న్యాయ్(ఇప్పుడు న్యాయం జరుగుతుంది)నినాదంతో రాహుల్ ఫోటో ఉన్న బ్యానర్లు అమేధీలోని గోడలపై ప్రత్యక్షమవడంతో ఈసీ ఈ నోటీసు ఇచ్చింది. బిల్డింగ్ యజమాని అనుమతి లేకుండా,స్థానిక ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ఈ బ్యానర్ లు ఏర్పాటు చేసినట్టు ఈసీ తన నోటీసులో తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఏప్రిల్-23,2019న వయనాడ్ లోక్ సభ స్థానానికి,ఐదో విడత పోలింగ్‌ లో భాగంగా మే-6,2019న అమేథీలో ఎన్నికలు జరుగనున్నాయి.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.