Rahul Gandhi: పరువునష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(24 జూన్ 2021) గుజరాత్ కోర్టులో హాజరుకావచ్చు. 'మోడీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ ఎమ్మెల్యే క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఫైనల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు రాహుల్ గాంధీని హాజరుకావాలని కోర్టు కోరింది.

Rahul Gandhi: పరువునష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Defamation Case: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(24 జూన్ 2021) గుజరాత్ కోర్టులో హాజరుకావచ్చు. ‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ ఎమ్మెల్యే క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఫైనల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు రాహుల్ గాంధీని హాజరుకావాలని కోర్టు కోరింది.

ఈ క్రమంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా బుధవారం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఉదయం 10 గంటలకు సూరత్ వచ్చి 12:30 గంటలకు తిరిగి వెళ్తారని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మాత్రమే రాహుల్ గాంధీ గుజరాత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు.

సూరత్ కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యుడు ఫిరోజ్ ఖాన్ పఠాన్ మాట్లాడుతూ, ఒక వారం క్రితం, సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎఎన్ డేవ్ రాహుల్ గాంధీని జూన్ 24 న కోర్టుకు హాజరుకావాలని, ఫైనల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని ఆదేశించారు. భారత శిక్షాస్మృతి(ఐపిసి)లోని 499, 500 సెక్షన్ల కింద రాహుల్‌పై 2019 ఏప్రిల్‌లో సూరత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువునష్టం దావా వేశారు.

ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అంటూ ఇంటిపేరు మోడీ. దొంగలందరికీ మోడీ అనే మారుపేరు ఎలా ఉంది? అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్‍‌ భవిష్యత్ వ్యూహంపై చర్చించడానికి పార్టీ సీనియర్లు గాంధీనగర్‌లో సమావేశం అయ్యారు. గుజరాత్ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు పరేష్ ధనాని ఇంట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమై రాబోయే రోజుల్లో పార్టీలో మార్పుల గురించి చర్చించారు. కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కొత్త ఇన్‌ఛార్జి, గుజరాత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనుంది.

అంతకుముందు సీనియర్ నాయకుడు భారత్ సింగ్ సోలంకి, ప్రతిపక్ష నాయకుడు పరేష్ ధనాని, మాజీ అధ్యక్షుడు అర్జున్ మోద్వాడియా, మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ్ పటేల్, మాజీ ఎంపి జగదీష్ ఠాకూర్, ఎమ్మెల్యే విర్జీ తుమర్ తదితరులు పార్టీలో పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ రాక రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.