Bharat Jodo Yatra: రాజకీయ ప్రవేశం తరువాత తొలిసారి.. తండ్రి స్మారకాన్ని సందర్శించిన రాహుల్..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.

Bharat Jodo Yatra: రాజకీయ ప్రవేశం తరువాత తొలిసారి.. తండ్రి స్మారకాన్ని సందర్శించిన రాహుల్..

Rahul Gandhi

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడుకు చేరుకున్నారు. కాగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. రాహుల్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత ఈ స్మారకం సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉదయం 7గంటల సమయంలో తండ్రి రాజీవ్ గాంధీ స్మారకం ను సందర్శించి రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు ఈ స్మారకం ప్రాంగణంలో రాహుల్ మొక్కను నాటారు.

Rahul Gandhi pays homage at his father, former Prime Minister Rajiv Gandhi's memorial in Sriperumbudur.

Rahul Gandhi pays homage at his father, former Prime Minister Rajiv Gandhi’s memorial in Sri perumbudur.

Bharat Jodo Yatra: నేటి నుంచి ప్రారంభంకానున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. ఈ రోజు షెడ్యూల్ ఇలా..

రాజీవ్ గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా రాహుల్ పలు కీలక వ్యాఖలు చేశారు. విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదంటూ రాహుల్ తన ట్విటర్ లో రాసుకొచ్చారు.

ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది, ఆశ భయాన్ని ఓడిస్తుంది, మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు అంటూ రాహుల్ ట్విటర్ లో పేర్కొన్నారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ను సాయంత్రం 5గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహాయ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గోనున్నారు.