యుద్ధ పైలెట్స్ కు మా సెల్యూట్

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 04:46 AM IST
యుద్ధ పైలెట్స్ కు మా సెల్యూట్

పాక్ భూభాగంలోకి ప్రవేశించి.. తీవ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత వాయుసేన పైలెట్లకు ఇదే నా సెల్యూట్. మీ సాహసానికి ఇది మా వందనం అంటూ దేశ ప్రజలు స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ కూడా సెల్యూట్ చేస్తూ ట్విట్ చేశారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని.. ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. 
Also Read : జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయసేన మెరుపు దాడులు చేసింది. తెల్లవారుజామున 3.30 గంటలకు 12 మిరాజ్ జెట్స్‌ తో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులకు దిగింది భారత్. బాల్కోట్, చకోటి, ముజఫరాబాద్ లో మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.
Also Read : భారత్ సర్జికల్ ఎటాక్ : షేర్ మార్కెట్ ఢమాల్

పుల్వామా ఉగ్రదాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దెబ్బకు దెబ్బ తీసింది. ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్ పీఎఫ్ కాన్వాయ్ పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 

Also Read : టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు